'నాకు కరోనా సోకలేదు.. అల్లానే కాపాడాడు': హఫీజ్‌

Rekulapally Saichand | news18-telugu
Updated: June 25, 2020, 4:41 PM IST
'నాకు కరోనా సోకలేదు.. అల్లానే కాపాడాడు': హఫీజ్‌
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాక్ జట్టును కరోనా మహమ్మారి వణికిస్తోంది. 10 మంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు పీసీబీ మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన ఆటగాళ్ళలలో పాక్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ కూడా ఉన్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ విషయం స్పందించిన హఫీజ్‌ తనకు కరోనా సోకలేదంటూ పర్సనల్‌గా చేయించుకున్న కరోనా పరీక్ష రిపోర్టును ట్విటర్‌‌లో షేర్‌ చేశాడు. "ఆ రిపోర్ట్స్‌లో నెగెటివ్‌ వచ్చింది. అల్లా నా కుటుంబాన్ని రక్షించాడు.. ఆయన మమ్నల్ని కాపాడాడు"అంటూ ట్విట్ చేశాడు.

ఈ విషయంపై స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు హఫీజ్‌‌కు మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైంది. కరోనా టెస్ట్‌ల ఫలితాన్ని సోషల్ మీడియా వేదికగా హఫీజ్ వెల్లడించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. హాఫీజ్ తొందరపడ్డాడని ఇది బోర్డు క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించడమేనని పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

కాగా క్రికెటర్లకు కరోనా సోకడం పీసీబీని కలవరపెడుతోంది. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా 29 మంది క్రికెటర్లకు ఎంపిక చేసిన పీసీబీ వారికికరోనా పరీక్షలు నిర్వహించగా 10 మంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. అయినప్పటికి ఈ నెల 28న పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించడం విశేషం. ఇంగ్లండ్‌, పాక్ మధ్య 3 టెస్టులు, 3 టి20లు జరగనున్నాయి.
First published: June 25, 2020, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading