హోమ్ /వార్తలు /క్రీడలు /

Gutta Jwala: గుత్తా జ్వాలతో తమిళ హీరో విష్ణు విశాల్ నిశ్చితార్థం..

Gutta Jwala: గుత్తా జ్వాలతో తమిళ హీరో విష్ణు విశాల్ నిశ్చితార్థం..

గుత్తా జ్వాల విష్ణు విశాల్ ఎంగేజ్‌మెంట్ (gutta jwala vishnu vishal)

గుత్తా జ్వాల విష్ణు విశాల్ ఎంగేజ్‌మెంట్ (gutta jwala vishnu vishal)

Gutta Jwala Vishnu Vishal: కొన్ని రోజులుగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలతో తమిళ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు ఇతడితోనే ఏడడుగులు నడవడానికి సిద్ధమైపోయింది..

కొన్ని రోజులుగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలతో తమిళ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు ఇతడితోనే ఏడడుగులు నడవడానికి సిద్ధమైపోయింది గుత్తా జ్వాల. కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. దాన్ని దాచిపెట్టడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు ఈ జోడీ. తాజాగా ఈ ఇద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారు. సెప్టెంబర్ 7న గుత్తా 37వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన ప్రేయసికి శుభాకాంక్షలు చెబుతూ విష్ణు విశాల్‌ ఆసక్తికరమైన పోస్ట్ చేసాడు.


ప్రియమైన గుత్తా జ్వాలకు శుభాకాంక్షలు.. ఇది మన జీవితాలకు సరికొత్త ఆరంభం.. ఇలాగే పాజిటివ్‌గా ఉందాం.. బంగారు భవిష్యత్తు కోసం అడుగులేద్దాం.. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ చేసాడు. దాంతో పాటు తమ నిశ్చితార్థం కోసం అర్ధరాత్రి కూడా ఉంగరం తీసుకొచ్చి ఇచ్చిన గుత్తా జ్వాల మేనేజర్‌ బసంత్ జైన్‌కు ధన్యవాదాలు తెలిపాడు విష్ణు విశాల్. ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా చాలా సింపుల్‌గా జరిగింది. గుత్తా పుట్టినరోజునే ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

గుత్తా జ్వాల విష్ణు విశాల్ ఎంగేజ్‌మెంట్ (gutta jwala vishnu vishal)
గుత్తా జ్వాల విష్ణు విశాల్ ఎంగేజ్‌మెంట్ (gutta jwala vishnu vishal)

ఈ సందర్భంగా ఉంగరంతో తీసుకున్న ఫొటోలను విష్ణు ట్విటర్‌లో పోస్ట్ చేసాడు. ఇదిలా ఉంటే 2005లో గుత్తా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను పెళ్లి చేసుకుని.. 2011లో విడాకులు తీసుకుంది. మరోవైపు విష్ణు విశాల్ కూడా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో ఏడడుగులు నడిచి.. ఏడేళ్ల తర్వాత కొన్ని కారణాలతో 2018లో విడాకులు తీసుకున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Gutta Jwala, Telugu Cinema, Tollywood, Vishnu Vishal

ఉత్తమ కథలు