హోమ్ /వార్తలు /క్రీడలు /

2036 Olympics: 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు అహ్మదాబాద్ ఆసక్తి.. నగరంలో క్రీడల నిర్వహణ సాధ్యమేనా?

2036 Olympics: 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు అహ్మదాబాద్ ఆసక్తి.. నగరంలో క్రీడల నిర్వహణ సాధ్యమేనా?

next Olympics 2036 in Ahmedabad.

next Olympics 2036 in Ahmedabad.

Ahmedabad Urban Development Authority 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి

గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ అతిపెద్ద క్రీడా సంబరంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించడానికి అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AUDA) ఒక ఏజెన్సీని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీ రాబోయే మూడు నెలల్లో అహ్మదాబాద్‌లో ఒక సర్వే నిర్వహించి, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన అన్ని ప్రమాణాలపై నివేదికను సమర్పించనుంది. ఈ వార్తల నేపథ్యంలో ఒలింపిక్స్ చరిత్ర, ఈ పోటీలకు ఆతిథ్యాన్నిచ్చే నగరాన్ని ఎలా నిర్ణయిస్తారు, అహ్మదాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిద్దాం.

* ఒలింపిక్స్ చరిత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంగ్రామమైన ఒలింపిక్స్.. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 1986లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ప్రారంభమైంది. మొదటిసారి ఒలింపిక్స్ గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరిగాయి. ప్రపంచంలోని 14 దేశాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 1992 వరకు వేసవి, శీతాకాలపు ఒలింపిక్స్ జరిగాయి. అయితే తరువాత రెండు ఒలింపిక్స్ కలిసి కాకుండా, విడివిడిగా నిర్వహించాలని నిర్ణయించారు. సమ్మర్ ఒలింపిక్స్ జూలై- ఆగస్టు మధ్య జరుగుతుండగా, వింటర్ ఒలింపిక్స్ మార్చిలో జరుగుతాయి.

* ఒలింపిక్స్‌లో ఎలాంటి క్రీడలు ఉన్నాయి?

సమ్మర్, వింటర్ ఒలింపిక్స్ క్రీడలు భిన్నంగా ఉంటాయి. వేసవి ఒలింపిక్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్ (ఫీల్డ్ అండ్ ట్రాక్), అథ్లెటిక్స్ (మారథాన్-రేస్ వాక్స్), అక్వాటిక్స్, అక్వాటిక్స్ (స్విమ్మింగ్ మారథాన్), బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, కనోయి-కయాక్, కనోయి-కయాక్ (స్ప్రింగ్, మౌంటెన్ బైక్), సైక్లింగ్ ( రోడ్), సైక్లింగ్ (ట్రాక్), ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్ (ఫైనల్స్) ఫుట్‌బాల్ (ప్రిలిమ్స్), గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, మోడ్రన్ పెంటాథ్లాన్, రోయింగ్, రగ్బీ, సెయిలింగ్, తైక్వాండో, టెన్నిస్, ట్రయాథ్లాన్, వాలీబాల్, వాలీబాల్ ( బీచ్), వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్.. వంటివి సమ్మర్ ఒలింపిక్స్‌లో ఉంటాయి. సమ్మర్ ఒలింపిక్స్ కోసమే అహ్మదాబాద్ బిడ్ వేసే ప్రణాళికల్లో ఉంది.

* ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే నగరాన్ని ఎలా ఎంచుకుంటారు?

ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే నగరాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందుకు ప్రపంచంలోని పెద్ద నగరాలు ప్రతి రెండు సంవత్సరాలకు పోటీపడతాయి. సాధారణంగా ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే నగరాన్ని, ఆటలు నిర్వహించడానికి ఏడు సంవత్సరాల ముందే ఎంపిక చేస్తారు. ఇందుకు అనేక అంశాలను పరిశీలిస్తారు. క్రీడల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు, పర్యాటకులు, జర్నలిస్టులు, అథ్లెట్లకు వసతి సదుపాయం.. వంటివి పరిగణనలోకి తీసుకుంటారు.

మెరుగైన మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించే స్టేడియంలతో పాటు ప్రాక్టీస్ వెన్యూలు.. వంటివన్నీ నగరాల్లో ఉండాలి. రెండవ దశలో ఒలింపిక్స్‌ నిర్వహణకు పోటీ పడే నగరం 1,50,000 డాలర్ల ఫీజు చెల్లించాలి. అయితే కొత్త నియమాల ప్రకారం.. నగరంలో ఇప్పటికే ఎన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలను సైతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పరిశీలిస్తుంది.

* ఆతిథ్యానికి ఎలాంటి విషయాల్లో పోటీ ఉంటుంది?

ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చే నగరం, మొత్తం ఆరు విషయాలకు సంబంధించిన నివేదికలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సమర్పించాలి. వీటిలో విజన్ అండ్ లెగసీ ఫర్ కాంపిటీషన్, వెన్యూ మాస్టర్ ప్లాన్, అలైన్‌మెంట్-రీజినల్ డెవలప్‌మెంట్ ప్లాన్, వెన్యూ ఫండింగ్, క్రీడల తేదీలు, అథ్లెట్ల అనుభవం, ఒలింపిక్ క్రీడా గ్రామాలు, ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలు, పారాలింపిక్ గేమ్స్ నిర్వహణ, గవర్నెన్స్, సెక్యూరిటీ మొదలైనవి ఉన్నాయి. ఈ అన్ని విషయాల్లో నగరాల మధ్య పోటీ ఉంటుంది. అన్ని విధాలుగా పోల్చి చూసిన తరువాత, ఆతిథ్య నగరాన్ని ఎంపిక చేస్తారు.

* ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎంత ఖర్చవుతుంది?

భారత్‌లోని ఏ నగరమైనా ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ ఇప్పటి వరకు 25 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌ బడ్జెట్ 17 బిలియన్ డాలర్లు. గత ఒలింపిక్స్‌లో 207 జట్లు చేరాయి. మొత్తం 11,238 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. 207 జట్ల మధ్య మొత్తం 307 ఒలింపిక్ పోటీలు జరిగాయి.

* వివాదాలు- బహుమతులు

ఒలింపిక్స్‌లో వివాదాలు సైతం కొత్తేంకాదు. టోక్యో ఒలింపిక్ క్రీడల క్రియేటివ్ చీఫ్ హిరోషి ససకి మార్చిలో తన పదవికి రాజీనామా చేశారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గతంలోనూ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ సభ్యులు వివాదాల్లో చిక్కుక్కున్నట్లు వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ క్రీడాకారులకు ఎలాంటి ప్రైజ్ మనీ ఇవ్వదు. కానీ పతకాలు సాధించిన క్రీడాకారులకు వివిధ దేశాలు పెద్ద మొత్తంలో నగదు బహుమతితో పాటు బోనస్‌లు, పదవులు సైతం కట్టబెడతాయి.

-

Published by:Rekulapally Saichand
First published:

Tags: Gujarath

ఉత్తమ కథలు