ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్న గుజరాత్ టైటాన్స్.. బెంగళూరు ముందు భారీ స్కోరు ఉంచుతుందని అంతా భావించారు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు ఆచితూచి ఆడేందుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో 20 ఏళ్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన వృద్ధమాన్ సాహా, శుభమ్ గిల్లో శుభమ్ గిల్ నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగుకే వెనుదిగిగాడు. అనంతరం వచ్చిన మాథ్యు కూడా 16 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో ఆ తరువాత వచ్చిన కెప్టెన్ హార్థిక పాండ్యా బ్యాటింగ్ భారాన్ని భుజాన వేసుకున్నాడు. 47 బాల్స్‌లో 62 పరుగులు చేశాడు. అందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి.
31 పరుగులు చేసి వృద్ధమాన్ సాహా ఔటైన తరువాత బరిలోకి దిగిన డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చివర్లో 6 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో రషీద్ ఖాన్ 19 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్.
ఈ మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ గెలిచినప్పటికీ.. జట్టు ప్లే ఆఫ్ స్టేజ్‌కు వెళ్లడం అంత ఈజీ కాదు. RCB ఈ మ్యాచ్‌లో మంచి రన్‌రేట్‌తో గెలవాలి. ఇక చివరి మ్యాచ్‌లో ఢిల్లీని ముంబై ఓడించడంపై వారు ఇప్పటికీ ఆధారపడతారు. కాబట్టి గుజరాత్‌పై బెంగళూరు టీమ్ విజయం మాత్రమే వారిని ప్లే ఆఫ్‌కు తీసుకెళ్లదు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవడం.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేతితో ఆర్సీబీ ఓడిపోయినా.. RCB, DCతో సహా నాలుగు జట్లు 14 పాయింట్లతో సమంగా ఉండవచ్చు.
Rinku Singh : ’బాధ ఎందుకు రింకూ.. మేమంతా నీ వెంటే‘.. కేకేఆర్ స్టార్ పై వెల్లువెత్తుతోన్న నీరాజనాలు
LSG vs KKR : లక్నో గెలిచినా.. హృదయాలను గెలుచుకున్న రింకూ సింగ్.. వాట్ ఏ నాక్..
అలాంటి పరిస్థితి వస్తే.. అప్పుడు నెట్ రన్‌రేట్ ఈ జట్లు ప్లే ఆఫ్‌కు వెళ్లే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడంతో పాటు ముంబై చేతిలో ఢిల్లీ ఓడిపోవడంతో పాటు మిగతా జట్ల రన్‌రేట్ కంటే బెంగళూరు జట్టు రన్‌రేట్ ఎక్కువగా ఉండాలని బెంగళూరు ఫ్యాన్స్ కోరుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Titans, IPL 2022, RCB