చెప్పుకోండి చూద్దాం.. విరాట్ కోహ్లీ ట్వీట్.. అభిమానులకు పజిల్..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సస్పెన్స్ ఫొటో ట్వీట్ చేశాడు. అందులో తనతో పాటు ఎదురుగా ఉన్న ఆటగాడు ఎవరో చెప్పాలని అభిమానులను కోరాడు.

news18-telugu
Updated: November 20, 2019, 2:49 PM IST
చెప్పుకోండి చూద్దాం.. విరాట్ కోహ్లీ ట్వీట్.. అభిమానులకు పజిల్..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సస్పెన్స్ ఫొటో ట్వీట్ చేశాడు. అందులో తనతో పాటు ఎదురుగా ఉన్న ఆటగాడు ఎవరో చెప్పాలని అభిమానులను కోరాడు.
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సస్పెన్స్ ఫొటో ట్వీట్ చేశాడు. అందులో తనతో పాటు ఎదురుగా ఉన్న ఆటగాడు ఎవరో చెప్పాలని అభిమానులను కోరాడు. విరాట్ కోహ్లీ, మరికొందరు ఆటగాళ్లు వర్షంలో తడుస్తున్నారు. కోహ్లీకి ఎదురుగా మరో ప్లేయర్ వస్తున్నాడు. ఆ ప్లేయర్ జెర్సీ మీద పేరు లేదు. ‘పార్ట్‌నర్స్ ఇన్ క్రైమ్. బౌండరీల వద్ద ఫీల్డర్స్ నుంచి డబుల్స్ దొంగిలిస్తాం. ఎవరో చెప్పండి’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ఫొటోను చూసిన అందరూ అతడు ధోనీ గురించే చెబుతున్నాడని అర్థం చేసుకుంటున్నారు. వెస్టిండీస్‌తో సిరీస్‌ కోసం రేపు టీమిండియా సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ధోనీని మళ్లీ జట్టులోకి తీసుకోనున్నట్టు సమాచారం. ధోనీ మళ్లీ జట్టులోకి వస్తున్నాడని సంకేతం వచ్చేలాగా కోహ్లీ ఈ ఫొటోను ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: November 20, 2019, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading