CSK vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 16వ సీజన్ కు మార్చి 31న తెరలేవనుంది. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనుంది. దీనిని గురు శిష్యుల సమరంగా అభిమానులు పేర్కొంటున్నారు. మ్యాచ్ శుక్రవారం రాత్రి గం.7.30లకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్.. డిజిటల్ లో జియో సినిమా లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు కూడా పట్టుదలగా ఉన్నాయి.
కూర్పు ఎలా ఉంటుందో
సీజన్ లో తొలి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు కూర్పుపై కసరత్తులు చేస్తోంది. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్ గా నిలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం లీగ్ దశలో 9వ స్థానంలో నిలిచి ఇంటిదారి పట్టింది. అయితే ఈసారి మాత్రం గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదల మీద చెన్నై ఉంది. ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతుండటంతో అతడికి ట్రోఫీతో వీడ్కోలు పలకాలనే పట్టుదల మీద చెన్నై కనిపిస్తోంది. ఇక కూర్పు విషయానికి వస్తే చెన్నై 4గురు బ్యాటర్లు.. 4 ఆల్ రౌండర్లు.. ముగ్గురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ లు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో బెన్ స్టోక్స్ ఆడే అవకాశం ఉంది. జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, బెన్ స్టోక్స్ రూపంలో జట్టులో నలుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు. అయితే తొలి మ్యాచ్ లో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేసేది అనుమానంగానే ఉంది. ఇక బౌలర్లుగా దీపక్ చహర్, డ్వేన్ ప్రిటోరియస్, సిమ్రన్ జీత్ సింగ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక తొలి మ్యాచ్ కు గుజరాత్ టైటాన్స్ ఫినిషర్ డేవిడ్ మిల్లర్ దూరమయ్యాడు. నెదర్లాండ్స్ తో రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ కారణంతో సౌతాఫ్రికా ప్లేయర్లు తొలి వారంలో ఆడే మ్యాచ్ లకు దూరంగా ఉండునున్నారు. అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తుంది. శుబ్ మన్ గిల్, సాహాలు ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. మిల్లర్ లేకపోడంతో మ్యాథ్యూ వేడ్ కు అవకాశం దక్కనుంది. కేన్ విలియమ్సన్ గుజరాత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, తెవాటియాలతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక బౌలింగ్ లో రషీద్ ఖాన్, సాయికిషోర్, షమీ, అల్జారీ జోసెఫ్ లు కీలకం కానున్నారు. అల్జారీ జోసెఫ్ ను పక్కన పెడితే జాష్ లిటిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్
ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, దీపక్ చహర్, డ్వేన్ ప్రిటోరియస్, సిమ్రన్ జిత్
గుజరాత్ టైటాన్స్
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుబ్ మన్ గిల్, సాహా, కేన్ విలియమ్సన్, వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, యశ్ దయాల్, జోసెఫ్, షమీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2023, Mohammed Shami, MS Dhoni, Ravindra Jadeja, Shubman Gill