హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే న్యూస్.. ఇది మాములు ప్లాన్ కాదు భయ్యా.. ఫుల్ కిక్కే..!

IND vs PAK : క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే న్యూస్.. ఇది మాములు ప్లాన్ కాదు భయ్యా.. ఫుల్ కిక్కే..!

Ind Vs Pak (Twitter)

Ind Vs Pak (Twitter)

IND vs PAK : భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కాశ్మీర్ సమస్య.. వంటి అంతర్జాతీయ స్థాయి సమస్యలు ఈ రెండు దేశాల మధ్య బ్రేకులు వేస్తున్నాయ్. దీంతో, కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్.

  నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం. అలాంటి పోరు కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఐసీసీ (ICC) మెగా ట్రోఫీలు కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఇరు దేశాల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ ఈ మధ్యలో జరగడం అసంభవమే. సాధారణంగా టీమిండియా (Team India).. క్రికెట్ ఆడే దేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఆహ్వానిస్తుంటుంది. పాకిస్తాన్‌ (Pakistan)తో మాత్రం అది సాధ్యపడేది కాదు. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కాశ్మీర్ సమస్య.. వంటి అంతర్జాతీయ స్థాయి సమస్యలు ఈ రెండు దేశాల మధ్య బ్రేకులు వేస్తున్నాయ్. దీంతో, కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్.

  అయితే, క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. చిరకాల ప్రత్యర్ధులైన భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య పోరుకు సంబంధించి క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా దాయాదులతో కలుపుకుని ముక్కోణపు సిరీస్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఏ చీఫ్ నిక్ హాక్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌-పాక్‌లు చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ్డాయి.

  ఇది కూడా చదవండి :  కోహ్లీకి సెంచరీ కాదు.. ముందు 43 పరుగులు కావాలి.. లేకపోతే ఆ అరుదైన రికార్డు గల్లంతే..!

  అయితే, ఆసీస్‌ క్రికెట్‌ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలతో భారత, పాక్‌ క్రికెట్ అభిమానుల్లో ఈ అంశానికి సంబంధించిన చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇదే విషయాన్ని పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదించాడు. అయితే, మూడు దేశాలు కాకుండా ఇంగ్లండ్‌ను కలుపుకుని నాలుగు దేశాల సిరీస్‌ను ఏర్పాటు చేయాలని రమీజ్‌ రాజా ఐసీసీని కోరాడు. తాజాగా హాక్లీ వ్యాఖ్యలతో మరోసారి భారత్‌-పాక్‌ సిరీస్‌ అంశం తెరపైకి వచ్చింది.

  ఇది కూడా చదవండి :  షేన్ వార్న్ మరణానికి ముందు అసలేం జరిగింది.. ఆ నలుగురు యువతులు ఎవరు..?

  ఇదిలా ఉంటే, భారత్-పాకిస్థాన్ మధ్య ముక్కోణపు సిరీస్ జరగడం దాదాపుగా అసాధ్యమని భారత క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2023 వరకు టీమిండియా షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌లు తలపడనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23న జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇదివరకే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. అంతకన్నా ముందు శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ లో భారత్, పాక్ జట్లు తలపడే అవకాశం ఉంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Australia, Cricket, IND vs PAK, India VS Pakistan, T20 World Cup 2022

  ఉత్తమ కథలు