షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కి మరిన్ని పతకాలు

దక్షిణ కొరియాలోనూ అదరగొడుతున్న భారత షూటర్లు... పసిడి, రజత, కాంస్య పతకాల పంట...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 7, 2018, 5:33 PM IST
షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కి మరిన్ని పతకాలు
పతకాలు సాధించిన భారత షూటర్లు
  • Share this:
ఏషియాడ్ 2018లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత షూటర్లు దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) ఛాంపియన్‌షిప్‌లోనూ అదరగొడుతున్నారు. ఇండోనేషియాలో గురి తప్పని భారత షూటర్లు, దక్షిణ కొరియాలోనూ అదరగొడుతున్నారు. ఏషియాడ్ 2018లో భారత షూటర్లు 2 స్వర్ణ పతకాలతో పాటు 4 రజత పతకాలు, 3 కాంస్య పతకాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అదే ఉత్సాహంతో చాంగ్వాన్‌కి వెళ్లిన భారత షూటర్లు అక్కడ కూడా అదే హవా కొనసాగిస్తున్నారు.

శ్రేయా అగర్వాల్, దివ్యాంశ్ సింగ్ జోడి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీం జూనియర్ ఫైనల్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచింది.


10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మెన్స్ జూనియర్ ఈవెంట్‌లో 245.5 స్కోర్ సాధించిన సౌరభ్ చౌదరి, పసిడి పతకాన్ని గెలిచాడు. ఇదే ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత షూటర్ అర్జున్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.



అర్జున్ సింగ్‌ను అభినందిస్తూ కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు.



మెన్స్ జూనియర్ ట్రాప్ టీం ఈవెంట్‌లో అమన్ ఇలహి, మానవ్ రాథోడ్, వివాన్ కపూర్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.



10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మెన్స్ ఈవెంట్‌లో అద్భుతంగా గురి చూసి తుపాకీ పేల్చిన హృదయ్ హజారికా స్వర్ణం సాధించాడు...



10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ ఉమెన్స్ టీం ఈవెంట్‌లో ఎలవెనిల్ వెలరివన్ రజత పతకం గెలుచుకుంది. ఇదే ఈవెంట్‌లో శ్రేయా అగర్వాల్ కాంస్య పతకం సాధించింది.



శ్రేయా అగర్వాల్‌ను అభినందిస్తూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.



ఇప్పటికే మనీషా ఖీర్ సిల్వర్ మెడల్, అర్జున్ సింగ్ చీమకు స్వర్ణం పతకం, గౌరవ్ రాణా కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. టీమ్ ఈవెంట్‌లో అర్జున్ చీమా, గౌరవ్ రాణా, అన్మోల్ జైన్ బృందం స్వర్ణం గెలుచుకుంది. అంజుమ్ మౌడ్గిల్ రజతం సాధించగా, అపూర్వి చండేలా నాలుగో స్థానంలో నిలిచి, ఇద్దరూ 2020 ఒలింపిక్ ఈవెంట్‌కు అర్హత సాధించడం విశేషం. ఒలింపిక్స్‌కు క్వాలిఫై మొదటి భారత షూటర్స్ జోడిగా వీరు రికార్డు క్రియేట్ చేశారు. మౌడ్గిల్, చండేలా, గోష్ మెహులీ జట్టు సిల్వర్ మెడల్ సాధించారు. దాంతో దక్షిణ కొరియాలో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది.

ఇదీ చదవండి..
భారత షూటర్లు అక్కడా అదరగొట్టారు!

ఏషియాడ్:50 మీ. రైఫిల్ షూటింగ్‌లో సంజీవ్‌‌ రాజ్‌పుత్‌కు రజతం


యూఎస్ ఓపెన్‌లో నవోమీ 'ఒసాకా' వండర్స్
Published by: Ramu Chinthakindhi
First published: September 7, 2018, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading