Home /News /sports /

GRAND WELCOME TO OLYMPIC MEDAL WINNER P V SINDHU IN ANDHRA PRADESH MINISTERS RECEIVED HER NGS GNT

PV Sindhu: విశాఖలో రెండు ఎకరాలకు సర్వ సిద్ధం.. ఒలింపిక్ మెడల్ విన్నర్ సింధుకు ఏపీలో ఘన స్వాగతం

ఏపీలో పీవీ సింధుకి ఘన స్వాగతం

ఏపీలో పీవీ సింధుకి ఘన స్వాగతం

ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుపై కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీకి చేరుకున్న ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. సీఎం జగన్ చేతులు మీదుగా ఆమె నగదు బహుమతిని అందుకోనుంది..

    ఒలింపిక్ విజేత.. వరుసగా రెండు సార్లు మెడల్ సాధించిన పి.వి సింధు (PV Sindhu)కు ఏపీలో ఘన స్వాగతం లభించింది. తాజాగా టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)లో భారత స్టార్ షట్లర్ సింధు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో (Badminton Singles) కాంస్య పతకం (Bronze Medal) సాధించి జాతీయ పతాకాన్ని టోక్యోలో రెప రెపలాడించింది. దేశానికి వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంశలు అందుతున్నాయి. ప్రధాని మోదీ నుంచి సామాన్యుడి వరకు పీవీ సింధు ఘనతను పొగుడుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగిని అయని పీవీ సింధును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కూడా అభినందనలు తెలిపారు. అలాగే ఆమెకు మరోవైపు పీవీ సింధుకు నగదు ప్రోత్సాహకాలు వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

    ఏపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగా.. వెంటనే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. 2014 నుంచి జాతీయ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో పతకాలు తెచ్చిన ప్రతీ క్రీడాకారులకు నగదు పురస్కారాన్ని ఇచ్చింది. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు కూడా స్పోర్ట్స్ పాలసీ ప్రకారం నగదు పురస్కారం అందించాలని అప్పుడే సీఎం జగన్ ఆదేశించారు. 2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారమే క్రీడాకారులకు నగదు పురస్కారాలను అందించనున్నారు.

    పీవీ సింధు ఒలింపిక్స్ 2020కి వెళ్లే ముందే ఏపీ ప్రభుత్వం రూ. 5 లక్షల నగదును సహాయంగా అందించింది. అలాగే గతంలోనే పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ కోసం కేటాయించింది. తాజాగా సింధుకు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ. 30 లక్షల నగదును ఇవ్వనున్నది.

    టోక్యో ఒలింపిక్స్ లో విజయం సాధించిన తరువాత తొలిసారి ఏపీకి తిరిగి వచ్చిన సింధుకు ఘనంగా స్వాగతం పలికింది ఏపీ ప్రభుత్వం. ఆమెకు విజయవాడలో ఘన స్వాగతం ఏర్పాటు చేశారు. మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు సింధుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ వెళ్లేముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపింది. ఒలింపిక్స్‌లో పతకం తేవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.

    ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయి ఒలింపిక్స్లో పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిన్న వయసులోనే రెండు మెడల్స్ తీసుకురావటం దేశానికి గర్వకారణమని కొనియాడారు. యువతకి సింధు రోల్ మెడల్‌గా నిలుస్తుందన్నారు. సింధును ఆదర్శంగా తీసుకొని యువత భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఇక విశాఖలో అకాడమీ కోసం సింధుకి సీఎం జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తుచేశారు. ఆ భూమి అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Avanti srinivas, Pv sindhu, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు