• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • GOVT SCHOOL IN ANDHRA PRADESH MAKING KIDS NATIONAL SPORTS PLAYERS BK

Andhra Pradesh: క్రీడాకారుల‌ను త‌యారు చేస్తోన్న ఏపీలో ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల!

Andhra Pradesh: క్రీడాకారుల‌ను త‌యారు చేస్తోన్న ఏపీలో ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల!

జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్ధులు

పిల్లలు ప్ర‌యోజ‌క‌లు కావాలంటే విద్య ఒక్క‌టే ఉంటే స‌రిపోదు చ‌దువుతో పాటు ఆట‌పాటలు కూడా చాలా ముఖ్యం స‌రిగ్గ ఇదే అంశాన్ని గుర్తించి మ‌ట్టిలో మాణిక్యాల‌ను వెలికి తీస్తోంది ఆ పాఠ‌శాల‌. విద్యార్దుల‌ ఇష్టాయిష్టాలు తెలుసుకొని...వారికీ నచ్చిన మార్గంలోనే వారిని నైపుణ్య‌వంతులుగా తీర్చిదిద్దుతుంది ఏపీలో ఆ పాఠ‌శాల. చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ పాఠ‌శాల జాతీయ స్థాయి క్రీడాకారుల‌ను త‌యారు చేస్తోంది.

  • Share this:
    పిల్ల‌ల‌కు చ‌దువుతో పాటు క్రీడ‌ల ప్రాదాన్య‌త గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. స‌రిగ్గ ఇదే అంశాన్ని గుర్తించిన ఏపీలో ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల త‌న స్కూల్ నుంచి వివిధ విభాగాల్లో రాష్ట్ర‌, జిల్లా స్థాయి క్రీడాకారుల‌ను త‌యారు చేస్తోంది. త‌మ‌కు విశాలమైన మైదానం., అత్యాధునిక మౌళిక‌ సదుపాయాలు లేక‌పోయిన‌ప్ప‌టికి కార్పొరేట్ స్కూల్స్ ను త‌ల‌ద‌న్నేల ఇక్క‌డ క్రీడాల్లో విద్యార్దుల‌కు శిక్ష‌ణ ఇస్తోన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, చిత్తూరు జిల్లాలోని కడపనత్తం ప్రభుత్వ పాఠశాలోని విద్యార్ధులు, చ‌దువుల‌తో పాటు క్రీడాలోనూ భేష్ అనిపించుకుంటున్నారు. బేస్ బాల్.,వాలీబాల్., బేస్ బాల్., టేబుల్ టెన్నిస్, ష‌టైల్ కాక్, క్రికెట్ లాంటి ప‌లు క్రీడల్లో  ప్రావిణ్యం సాధించి జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా త‌మ ప్ర‌తిభ‌ను చాటుతున్నారు. రాష్ట్రంలోనే ఎక్క‌డ లేని విధంగా ఈ స్కూల్ నుంచి ప‌దుల సంఖ్య‌లో పిల్ల‌లు వివిధ క్రీడా విభాగాల్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం విశేషం. దీంతో ప్ర‌భుత్వం కూడా ఈ స్కూల్ పై ప్ర‌త్యేక శ్ర‌ధ్ద క‌న‌బ‌రిచి మ‌ట్టిలో మాణిక్యాల‌ను వెలికితీస్తోంది. గ‌త వారం జ‌రిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్, బేస్ బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ ల‌కు ఈ ఒక్క స్కూల్ నుంచి 38 మంది విద్యార్ధులు రాష్ట్ర స్థాయికి ఎంపికైయ్యారు. దింతో క్రీడాకారుల‌ను త‌యారు చేసే స్కూల్ గా జిల్లాలో ఈ ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్కూల్ లో చ‌దువుతున్న విద్యార్ధుల ప్ర‌తిభ‌ను చూసి అధికారులు కూడా అవాక్క‌వుతున్నారు.

    జిల్లా క‌లెక్ట‌ర్ ఈ స్కూల్ కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌డానికి ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ కి ప్ర‌త్యేక మైదానం ఏర్పాటు చేయ‌డంతోపాటు విద్యార్దుల‌కు స్పొర్ట్స్ కిట్స్ కూడా అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే. ఈ స్కూల్ లో విధ్యార్ధులు ప్ర‌తిభ‌ను గుర్తించి ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌లు కూడా విద్యార్ధుల‌కు బాస‌ట‌గ నిల‌వ‌డానికి ముందుకొస్తోన్నాయి. దీంతో జిల్లాలో ఎక్క‌డ లేని విధంగా ఈ స్కూల్ స్పోర్ట్స్ స్కూల్ గా మారింది. ఆట‌ల్లో మాత్ర‌మే కాకుండా చ‌దువులో కూడా ఇక్క‌డ స్కూల్ విద్యార్ధులు ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తుండ‌డం విశేషం.

    అర‌కొర స‌దుపాయాలు ఉన్న‌ప్ప‌టికి విద్యార్ధుల్లో ఉన్న ప్ర‌తిభ‌ను, ఆస‌క్తి ని బ‌య‌ట‌కి తీయ‌డానికి పాఠ‌శాలో పీఈటీ మాస్ట‌ర్ గా ప‌ని చేస్తోన్న చిరంజీవి అంటారు విద్యార్ధుల త‌ల్లిదండ్రులు. ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ధ్ద క‌న‌బ‌ర‌చ‌డం వ‌ల‌నే ఈ రోజు త‌మ పిల్లలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చెచ్చుకుంటున్నార‌ని ఆనందం వ్య‌క్తం చేస్తోన్నారు. ప్ర‌స్తుతం  రాష్ట్ర స్థాయిలో జ‌రుగుతున్న ప‌లు క్రీడాల‌కు ఈ స్కూల్ నుంచి 12 మంది బాలలు., 13 మంది బాలికలు లీడ్ చేస్తుండ‌డం చాల సంతోషంగా ఉందని పీఈటీ మాస్టర్ చిరంజీవి న్యూస్ 18 కి తెలిపారు. రైతు బిడ్డ‌లుగా క్రిడాల్లో త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చ‌డం చాలా గ‌ర్వంగా ఉందంటున్నారు ఈ పీఈటీ మాస్ట‌ర్ చిరంజీవి.  ఈయ‌న కృషికి జిల్లా క‌లెక్ట‌ర్ నుంచి కూడా అభినంద‌న‌లు అందుకున్నారు.
    Published by:Balakrishna Medabayani
    First published:

    అగ్ర కథనాలు