2020 టోక్యో ఒలంపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తొలి బంగారు పతకాన్ని సాధిస్తారని భారత చీఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ధీమా వ్యక్తంచేశారు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా మునుపటి సంవత్సరం కంటే మెరుగైన ఆటతీరును భారత క్రీడాకారులు ప్రదర్శిస్తున్నట్లు సంతృప్తి వ్యక్తంచేశారు. 2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తొలిసారిగా ఉత్తమ ప్రదర్శనను కనబరిచారని గుర్తు చేశారు.
సైనా నెహ్వాల్, పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడపట్ల దేశ ప్రజల్లో ఉన్న దృక్పదాన్ని పూర్తిగా మార్చేశారని కితాబిచ్చారు. అంతకు ముందు వరకు బ్యాడ్మింటన్ క్రీడ అంటే పురుషులకు సంబంధించినది ఉండేదన్నారు. మరో రెండు ఒలంపిక్స్ పతకాలు సాధించే సత్తా పీవీ సింధులో ఉందని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pullela Gopichand, Pv sindhu, Saina Nehwal