Sundar Pichai Epic Response To Pak Fan : టీ20 వరల్డ్ కప్2022(T20 World Cup) 2022 లో భాగంగా ఇండియా- పాకిస్తాన్(India Vs Pakistan) మధ్య ఆదివారం ముగిసిన మ్యాచ్ భారత్, పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అలరించింది. మెల్బోర్న్ లో నరాలు తెగే ఉత్కంఠను మించి జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ జయభేరి మోగించింది. ఇండియా విజయం సాధించడంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ చిరస్మరణీయ గెలుపును ఆస్వాదించారు. భారత సంతతి వ్యక్తి అయిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Google CEO Sundar Pichai) కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. టీవీలో మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసిన గూగుల్ సీఈవో దీపావళి(Diwali) రోజున ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రజలకు ట్విట్టర్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గూగుల్ సీఈవో.."నిన్నటి మ్యాచ్ లోని చివరి మూడు ఓవర్లను నేడు మరోసారి వీక్షించి పండుగ చేసుకున్నా. ఏం మ్యాచ్, ఏం పెర్ఫార్మెన్స్" అని ట్వీట్ లో తన స్పందన తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తమ అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేసి సుందర్ పిచాయ్ చేతిలో వెర్రిపుష్ఫాలు అయ్యారు.
Ind vs Pak: దివాళీ షాపింగ్ బంద్... యూపీఐ లావాదేవీలు ఢమాల్... కారణం విరాట్ కోహ్లీనే
సుందర్ పిచాయ్ ట్వీట్‌పై మొహమ్మద్ షెహజైబ్ అనే ఓ పాక్ నెటిజన్ స్పందిస్తూ.." మీరు(సుందర్ పిచాయ్) మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది" అంటూ వెటకారంగా ఆరంభంలో టీమిండియా వికెట్లు కోల్పోయిన సందర్భాన్ని ప్రస్తావించాడు. ఈ ట్వీట్‌కు సుందర్ పిచాయ్ అదిరిపోయే గట్టి కౌంటర్ ఇచ్చారు. "అది కూడా చూశా.. భువీ, అర్ష్‌దీప్ నుంచి అద్భుతమైన బౌలింగ్ స్పెల్" అంటూ రిప్లై ఇచ్చి పాక్ నెటిజన్ నోరు మూయించారు సుందర్ పిచాయ్. తాను టీమిండియా ఇన్నింగ్స్ గురించి చెబుతున్నానంటూ నెటిజన్ రిప్లై ఇచ్చాడు.
Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family. ???? I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022
— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
you should watch 1st three overs
— Muhammad Shahzaib (@Muhamma91436212) October 24, 2022
పాక్ అభిమాని టీమిండియా ఇన్నింగ్స్ మొదటి మూడు ఓవర్లను ప్రస్తావించగా, సుందర్ పిచాయ్ పాకిస్థాన్ ఇన్నింగ్స్ మొదటి మూడు ఓవర్ల విషయాన్ని ఎత్తిచూపారు. దాంతో పాక్ అభిమానులు తోక ముడిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India pakistan, Sundar pichai, Team India, Virat kohli