Yuvraj Singh : యువీ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే వార్త..త్వరలో ఆస్ట్రేలియా గడ్డపై సిక్సర్ల వర్షం..

Yuvraj Singh (ఫైల్ ఫోటో)

Yuvraj Singh : యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బ్యాట్‌తో మ‌ళ్లీ మెరుపులు మెరిపిస్తాడా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు.

  • Share this:
    యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బ్యాట్‌తో మ‌ళ్లీ మెరుపులు మెరిపిస్తాడా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టి తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. యువరాజ్‌ సింగ్‌, వెస్టిండీస్‌ వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ త్వరలో ఆసీస్‌ గడ్డపై బ్యాట్లు ఝుళిపించే అవకాశాలున్నాయి. మెల్‌బోర్న్‌కు చెందిన ‘మల్‌గ్రేవ్‌ క్రికెట్‌ క్లబ్‌’ వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ నంచి ఫిబ్రవరి మధ్య జరిగే టీ20 టోర్నీలో వీళ్లు పాల్గొనే వీలుంది. ఇప్పటికే 90 శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆ క్లబ్‌ అధ్యక్షుడు మిలాన్‌ పుల్లెనయెగమ్‌ పేర్కొన్నారు. వీరితో పాటు విండీస్‌ దిగ్గజం బ్రయన్‌లారా, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ను సైతం తమ క్లబ్‌లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

    "మేము శ్రీలంక ఆటగాళ్లు తిలకరత్నె దిల్షాన్‌, ఉపుల్‌ తరంగా, సనత్‌ జయసూర్య(హెడ్‌కోచ్‌)తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. మరికొంత మంది పేరుమోసిన ఆటగాళ్లను కూడా తీసుకునే పనిలో నిమగ్నమయ్యాం. ఈ క్రమంలోనే క్రిస్‌గేల్‌, యువరాజ్‌తో సంప్రదింపులు చేస్తున్నాం. ఇప్పటికే వారితో 90 శాతం చర్చలు పూర్తయ్యాయి. కొన్ని అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెద్ద క్రికెటర్లను తీసుకోవడం అనేది సుదీర్ఘ ప్రక్రియ. వాళ్ల కోసం అనేక ఏర్పాట్లు చేయాలి. ఆస్ట్రేలియాకు రావడానికి, ఇక్కడ ఉండటానికి, ప్రయాణం, వసతి, ఆహారం ఇలా అన్నీ చూసుకోవాలి. అయితే, వారితో పాటు స్పాన్సర్ల నుంచి కూడా మా క్లబ్‌కు ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇవన్నీ చర్చల్లో భాగం. త్వరలోనే స్పష్టమైన సమాచారం అందిస్తాం"అని మిలాన్‌ వివరించారు.

    మరోవైపు ఈ విషయంపై యువీ లేదా గేల్‌ ఇంకా స్పందించలేదు.యువరాజ్ తన కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8,701 పరుగులు, టీ20ల్లో 8 అర్ధసెంచరీలతో 1177 పరుగులు, టెస్టుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు.మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌ల్లో(2007 టీ20, 2011 వన్డే) యువరాజ్ కీలక పాత్ర పోషించాడు.

    2011 వన్డే ప్రపంచకప్‌లో అటు బ్యాట్, ఇటు బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి టీమిండియా కప్పు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 9మ్యాచ్‌ల్లో 362(ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు)పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published: