GOOD NEWS FOR TEAM INDIA FANS BCCI SET TO ALLOW FULL CAPACITY FOR IND VS SA T20 SERIES SRD
IND vs SA T20 Series : బాబు.. రెడీగా ఉండండమ్మా.. స్టేడియాలు దద్దరిల్లిపోవాల్సిందే..!
Team India
IND vs SA T20 Series : ఇప్పటికే భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవలే 16మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టెంబా బావుమా వ్యవహరించనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన పది రోజుల తర్వాత దక్షిణాఫ్రికా (South Africa)తో భారత్ (India) పొట్టి ఫార్మాట్ లో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ క్రమంలో జూన్ 9న ఆరంభమయ్యే ఈ సిరీస్ జూన్ 19వ తేదీతో ముగియనుంది. ఇక, ఈ సిరీస్ సందర్భంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 9న ప్రారంభమయ్యే భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA T20 Series) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు స్టేడియంలలోకి పూర్తి స్థాయి సామర్థ్యంతో అభిమానులను అనుమతించేందుకు బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కోసం బీసీసీఐ పూర్తి స్థాయి ప్రేక్షకులను అనుమతించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా పూర్తిగా అదుపులో ఉండడంతో భారత ప్రభుత్వం కోవిడ్ ప్రోటోకాల్‌లను సడలించింది. ఫలితంగా బీసీసీఐ రాబోయే సిరీస్‌లలో స్టేడియంలలోకి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అనుమతించడానికి సన్నద్ధమైంది.
షెడ్యూల్ ఇదే..
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జూన్ 9న జరిగే మ్యాచ్ తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12వ తేదీన రెండో టి20, మహారాష్ట్రలోని విదర్భలో 14వ తేదీన మూడో టి20 జరగనున్నాయి. ఇక చివరి రెండు టి20లకు సౌరాష్ట్ర, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ రెండు టి20లు కూడా జూన్ 17, 19వ తేదీల్లో జరుగుతాయి.
ఇప్పటికే భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవలే 16మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టెంబా బావుమా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా టీమ్‌కు ఇది చాలా ముఖ్యమైన పర్యటన కానుంది.
2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడాన్ని త్రుటిలో మిస్సయిన తర్వాత దక్షిణాఫ్రికాకు ఇది తొలి టీ20 టోర్నమెంట్ కానుంది. ఇక ఆస్ట్రేలియాలో జరగనున్న రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 12దశ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇండియా ఒకే గ్రూప్‌లో ఆడనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.