GOOD NEWS FOR SUNRISERS HYDERABAD FANS NEW ZEALAND CRICKET BOARD RELEASED IPL BOUND KIWIS PLAYERS JNK
IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ క్రికెటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బోర్డు
ఐపీఎల్లో ఆడటానికి ఆ దేశ క్రికెటర్లకు గ్రీన్ సిగ్నల్.. (PC: IPLT20)
ఐపీఎల్ 2021 రెండో దశ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్నది. విదేశీ ప్లేయర్ల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నా.. ఇప్పుడిప్పుడే అన్ని క్రికెట్ బోర్డులు క్లియరెన్స్ ఇస్తున్నాయి.
ఐపీఎల్ 2021 (IPL 2021) సందడి అప్పుడే మొదలయ్యింది. కరోనా కారణంగా మే 4 ఐపీఎల్ 2021ని అర్దాంతరంగా వాయిదా వేస్తూ బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకున్నది. దీంతో అన్ని దేశాల క్రికెటర్లు తమ సొంత దేశాలకు వెళ్లిపోయారు. అంతే కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సిరీస్‌లలో తమ దేశం తరపున ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 రెండో దశను (Second Phase) సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ (UAE) వేదికగా నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, వెస్టిండీస్ క్రికెటర్లు రావడానికి పలు సిరీస్‌లు, లీగ్‌లు అడ్డుగా మారాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) షెడ్యూల్ కారణంగా వెస్టిండీస్ క్రికెటర్లు ఐపీఎల్ రావడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో బీసీసీఐ దగ్గరుండి మరీ సీపీఎల్ షెడ్యూల్‌ను ముందుకు జరిపించింది. ఇలా ప్రతీ బోర్డుతో చర్చలు జరిపి వారి క్రికెటర్లు ఐపీఎల్ పాల్గొనేలా బీసీసీఐ పావులు కదిపింది. ఇక ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు కావడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల రాకకు కూడా మార్గం సుగమమం అయ్యింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఐపీఎల్లో పాల్గొనే అవకాశాలు మెరుగయ్యాయి. ఇక కివీస్ విషయంలో చాలా సందిగ్దత నెలకొన్నది.
కాగా, తాజాగా న్యూజీలాండ్ క్రికెట్ తీసుకున్న నిర్ణయంతో కివీస్ క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొనడానికి రూట్ క్లియర్ అయ్యింది. ఐపీఎల్లో ఆడుతున్న కివీస్ క్రికెటర్లను బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటనల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కేన్ విలియమ్సన్ (Kane Williamson) సహా కైల్ జేమిసన్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్డ్ లు ఐపీఎల్ రెండో దశలో పాల్గొనడం దాదాపు ఖరారయ్యింది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ ఆడటానికి వస్తుండటంతో టామ్ లాథమ్‌కు న్యూజీలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పదించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పర్యటనల్లో కివీస్ జట్టును టామ్ లాథమ్ నడిపించనున్నాడు. అగస్టు 23 నుంచి బంగ్లాదేశ్ పర్యటన ప్రారంభం కానున్నది. ఆ పర్యటన ముగిసిన వెంటనే జట్టు పాకిస్తాన్ వెళ్తుంది. 2002 తర్వాత కివీస్ జట్టు పాకిస్తాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ రెండు పర్యటనలు సరిగ్గా ఐపీఎల్ సమయంలోనే జరుగుతున్నది. దీంతో ఐపీఎల్లో ఆడే కివీస్ క్రికెటర్లను ఈ జట్టు నుంచి మినహాయించారు.
ఐపీఎల్ 2021లో సన్ రైజర్స్ జట్టును కేన్ విలియమ్స్ నడిపిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను జట్టు యాజమాన్యం ఈ ఏడాది తొలి దశ సమయంలోనే తొలగించింది. వరుగా మ్యాచ్‌లు ఓడిపోతుండటంతో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి కేన్ విలియమ్సన్కు అప్పగించారు. కేన్ మామ కెప్టెన్సీలో ఆడిన మ్యాచ్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే హైదరాబాద్ జట్టు తర్వాతి దశలో అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉన్నది. మరి రెండో దశలో అయినా కొత్త కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు గెలుపు దిశగా నడిపిస్తాడో లేదో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.