హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral News : క్యా సీన్ హై.. ఒకే జట్టుకు ఆడుతున్న భారత్- పాక్ స్టార్ ఆటగాళ్లు.. రెండు కళ్లు చాలవ్..!

Viral News : క్యా సీన్ హై.. ఒకే జట్టుకు ఆడుతున్న భారత్- పాక్ స్టార్ ఆటగాళ్లు.. రెండు కళ్లు చాలవ్..!

Ind Vs Pak (Twitter)

Ind Vs Pak (Twitter)

Viral News : ఎప్పుడూ ప్రత్యర్ధులుగా కాలుదువ్వే భారత్- పాక్ ఆటగాళ్లు ఒకే జట్టు తరఫున బరిలోకి దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  భారత్, పాకిస్థాన్ (India - Pakisthan) జట్ల స్టార్ క్రికెటర్లు ఒకే జట్టుకు ఆడుతున్నారు. అవునండి మీరు విన్నది నిజమే. ఈ ఘటన ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ (County Cricket) లో చోటు చేసుకుంది. గురువారమే ససెక్స్​ జట్టు తరఫున అరంగేట్రం చేశారు ఛతేశ్వర్ పుజారా (Cheteswar Pujara), మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan). వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా, పాకిస్థాన్​కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగుతున్నారు. ఇంగ్లాండ్​లో జరుగుతున్న కౌంటీ క్రికెట్​ కోసం వీరు ససెక్స్​ జట్టు తరఫున గురువారం అరంగేట్రం చేశారు. కౌంటీల్లో గతంలో యార్క్​షైర్​కు ఆడిన అనుభవం పుజారాకు ఉంది. అయితే, కౌంటీల్లో ఆడటం రిజ్వాన్​కు ఇదే తొలిసారి.

  డెయిన్స్​ కెప్టెన్సీలో పుజారా-రిజ్వాన్ ఇద్దరూ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్రత్యర్థి డెర్బిషైర్​ బ్యాటింగ్​ ఎంచుకోగా, వీరు రెండో రోజున కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. చూడముచ్చటగా ఉందని పలువురు కామెంట్లు పెడుతుంటే.. పరిస్థితులు మెరుగుపడి భారత్​-పాక్​ మధ్య మ్యాచ్​లు జరగాలని మరికొందరు ఆశిస్తున్నారు.

  అంతర్జాతీయ కెరీర్​ పరంగా పుజారా-రిజ్వాన్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన పుజారా.. పునరాగమనం కోసం శ్రమిస్తున్నాడు. ఐపీఎల్​ మెగావేలంలోనూ అతడిని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడం వల్ల అన్​సోల్డ్​గానే మిగిలాడు. మరోవైపు కొన్నేళ్లుగా అద్భుత ఫామ్​లో ఉన్న రిజ్వాన్.. అత్యుత్తమ వికెట్​కీపర్​గా రాణిస్తున్నాడు.

  టీమిండియా టెస్టు స్పెషలిస్టు అయిన పుజారా. గత కొద్దికాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. వరుస టోర్నీలలో విఫలమవుతూ ఒకరకంగా జట్టుకు భారంగా కూడా మారాడు. దీంతో ఇటీవలే లంకతో ముగిసిన టెస్టు సిరీస్ లో అతడితో పాటు మరో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే కు తుది జట్టులో చోటు దక్కలేదు.

  ఇది కూడా చదవండి : ఆరెంజ్ ఆర్మీకి బిగ్ రిలీఫ్.. సుందర్ స్థానంలో బరిలోకి కత్తీ లాంటి ఆల్‌రౌండర్‌..

  దీంతో ఈ ఇద్దరూ ఇటీవలే భారత్ లో ముగిసిన రంజీ సీజన్ లో కూడా ఆడారు. అయితే అక్కడ కూడా పెద్దగా సత్తా చాటింది లేదు. అలాగే, ఈసారి ఐపీఎల్ లో ఏ జట్టూ పుజారాను కొనుగోలు చేయలేదు. మరోవైపు, రిజ్వాన్ విషయానికొస్తే.. పాక్ తరఫున అద్భుతంగా ఆడుతున్నాడు. లిమిటెట్ ఓవర్లలో క్రికెట్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తో కలిసి తమ జట్టుకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cheteswar Pujara, Cricket, England, India VS Pakistan

  ఉత్తమ కథలు