Home /News /sports /

GOOD NEWS FOR CRICKET LOVERS INDIA VS PAKISTAN MATCH IN ASIA CUP 2022 SCHEDULED IN SEPTEMBER SAYS REPORTS SRD

Ind Vs Pak : క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే..

Ind Vs Pak (Twitter)

Ind Vs Pak (Twitter)

Ind Vs Pak : సాధారణంగా టీమిండియా.. క్రికెట్ ఆడే దేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఆహ్వానిస్తుంటుంది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కాశ్మీర్ సమస్య.. వంటి అంతర్జాతీయ స్థాయి సమస్యలు ఈ రెండు దేశాల మధ్య బ్రేకులు వేస్తున్నాయ్.

ఇంకా చదవండి ...
    నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం. అలాంటి పోరు కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఐసీసీ మెగా ట్రోఫీలు కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఇరు దేశాల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ ఈ మధ్యలో జరగడం అసంభవమే. సాధారణంగా టీమిండియా.. క్రికెట్ ఆడే దేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఆహ్వానిస్తుంటుంది. పాకిస్తాన్‌తో మాత్రం అది సాధ్యపడేది కాదు. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కాశ్మీర్ సమస్య.. వంటి అంతర్జాతీయ స్థాయి సమస్యలు ఈ రెండు దేశాల మధ్య బ్రేకులు వేస్తున్నాయ్. దీంతో, కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్.

    అయితే, క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ రెండు జట్లు త్వరలోనే తలపడనున్నాయ్. అందుకు శ్రీలంక వేదిక కానుంది. ఆసియా కప్ 2022 కి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఆ మెగాటోర్నీలో తలపడనున్నాయ్. శ్రీలంకలో జరిగే ఆసియా కప్ టీ-20 ఫార్మాట్ లో జరగనుంది. ఇక, 2023 ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ 50 ఓవర్లలో ఫార్మాట్ లో జరగనుంది.

    ఆసియా కప్ ను పక్కనపెడితే.. ఇక, వచ్చే ఏడాది టీ-20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. దీంతో, ఆ మెగాటోర్నీలో కూడా పాక్ జట్టుతో భారత్ తలపడే ఛాన్సు ఉంది. ఓవరాల్ గా టీ-20 క్రికెట్ లో రికార్డులు భారత్ కే అనుకూలంగా ఉన్నాయ్. మొత్తం తొమ్మిది సార్లు ఇరు జట్లు తలపడితే.. ఆరు సార్లు టీమిండియా నెగ్గగా.. పాక్ రెండు సార్లు విజయ ఢంకా మోగించింది. అయితే, ఈ రెండు జట్లు మెగాటోర్నీ గెలిచి చాలా ఏళ్లైంది. టీమిండియా 2007 లో టీ-20 వరల్డ్ కప్ నెగ్గగా.. పాకిస్థాన్ 2009 టోర్నీని తమ ఖాతాలో వేసుకుంది.

    ఇది కూడా చదవండి :  తనకిష్టమైన "హానీ" తో టీ డేటింగ్ కు వెళ్లిన ధోనీ.. భార్య సాక్షితో అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

    ఇక, రీసెంట్ గా జరిగిన మెగా టోర్నీలో టీమిండియాతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్‌ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్‌ అజమ్‌(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్‌ రిజ్వాన్‌( 79 పరుగులు, 55 బంతులు; 6 ఫోర్లు, 3 సిక్సర్లు)లు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 152 పరుగులు కొట్టి పాకిస్తాన్‌కు ఘన విజయాన్ని అందించారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND vs PAK, India VS Pakistan, Sri Lanka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు