Home /News /sports /

GOOD NEWS FOR CRICKET FANS T20 MATCHES EVEN IN MULTIPLEXES OPPORTUNITY TO WATCH SAYS OFFICIALS VB

ICC T20 World Cup 2021: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మల్టీప్లెక్స్‌లలో కూడా టీ20 మ్యాచ్ లు..

మల్టీప్లెక్స్

మల్టీప్లెక్స్

ICC T20 World Cup 2021: ఐపీఎల్ ఫీవర్ ముగిసింది. నాలుగో సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను నెగ్గిన విషయం తెలిసిందే. తర్వాత యూఏఈ, ఒమన్ వేదికగా క్రికెట్ లవర్స్ ను అలరించడానికి ధనాధన్ టోర్నీ టీ -20 ప్రపంచ కప్ ( T-20 World Cup 2021) రెడీ అయింది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. అయితే ఈ సారి ఆ మ్యాచ్ లను మల్టీప్లెక్స్‌లలో కూడా వీక్షించవచ్చని పీవీఆర్ సినిమాస్‌ అధికారులు పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్(Indian Premier League) ఫీవర్ ముగిసింది. నాలుగో సారి చెన్నై సూపర్ కింగ్స్(CSK) టైటిల్ ను నెగ్గిన విషయం తెలిసిందే. తర్వాత యూఏఈ(UAE), ఒమన్ వేదికగా క్రికెట్ లవర్స్ ను అలరించడానికి ధనాధన్ టోర్నీ టీ -20 ప్రపంచ కప్ ( T-20 World Cup 2021) రెడీ అయింది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. నేటి నుంచి అంటే అక్టోబర్‌ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా.. అక్టోబ‌ర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 45 రోజుల టోర్నమెంట్‌లో 16 జట్లు పాల్గొంటాయి. టీ 20 ప్రపంచకప్ సందర్భంగా అభిమానులు స్టేడియానికి వెళ్లడానికి అనుమతించారు.

    Ban Pak Cricket : " పాక్ తో మ్యాచ్ ఆడొద్దు... ఆ జట్టును బ్యాన్ చేయండి " .. టీమిండియాపై పెరుగుతున్న ఒత్తిడి..


    అదే సమయంలో భారతదేశంలోని అభిమానులు కూడా మల్టీప్లెక్స్‌లలో మ్యాచ్‌లను తిలకించవచ్చు. ఈ ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ (IND vs PAK) తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఐసిసి పివిఆర్ సినిమాస్‌తో జతకట్టింది. మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్‌ సినిమాస్ ఐసిసి పురుషుల టి 20 ప్రపంచకప్ 2021 క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులను పొందింది. సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో సహా అన్ని భారత మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది.

    ఈ మ్యాచ్‌లు న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్‌తో సహా 35 కి పైగా నగరాల్లోని 75 కి పైగా థియేటర్లలో ప్రదర్శిస్తారు. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడగా.. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక 100 శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో థియేటర్లను ప్రారంభించగా ముంబైలో 50 శాతం మందిని అనుమతించారు.

    T20 World Cup 2021 : " అతడే మా సైన్యం.. టీ20 ప్రపంచకప్ మాదే ".. ఆ ప్లేయర్ పై కోహ్లీ ప్రశంసలు..


    ప్రస్తుతం భారత బృందంలో మరో నాలుగు జట్లు ఉన్నాయి. నాకౌట్‌కి ముందు ఇండియా సూపర్ 12 లో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు అక్టోబర్ 18, 20 తేదీలలో, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉండగా.. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉంది.

    ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులను దాయాది దేశ క్రికెట్‌ బోర్డు దక్కించుకోవడంతో టీమిండియా పాక్ పర్యటన అంశం తెరపైకి వచ్చింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ భేటీలో పీసీబీకి ఆసియా కప్‌ 2023 వన్డే ఫార్మాట్‌ నిర్వహణ బాధ్యతలను అప్పచెబుతూ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లోనే ఆసియా కప్‌ను పాక్‌లో నిర్వహించాల్సి ఉండింది. అయితే అప్పట్లో పాక్‌ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అనడంతో పీసీబీ ఆ బాధ్యతలను శ్రీలంకకు కట్టబెట్టింది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Cricket, ICC, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు