• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • GLENN MAXWELLS WHIRLWIND 31 BALL 70 HAD FIVE SIXES IN IT AND ONE OF THEM BROKE A SEAT IN WELLINGTON SRD

Glenn Maxwell : సిక్స్ తో సీటుకే బొక్కెట్టిన మ్యాక్స్‌వెల్..పండుగ చేసుకుంటున్న ఆర్‌సీబీ ఫ్యాన్స్..

Glenn Maxwell : సిక్స్ తో సీటుకే బొక్కెట్టిన మ్యాక్స్‌వెల్..పండుగ చేసుకుంటున్న ఆర్‌సీబీ ఫ్యాన్స్..

గ్లేన్ మ్యాక్స్‌వెల్ (Photo Credit : Twitter)

Glenn Maxwell : ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్ వెల్ దుమ్మురేపాడు. కివీస్ తో జరిగిన ఆఖరి టీ-20లో తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు.

  • Share this:
    ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్ వెల్ దుమ్మురేపాడు. కివీస్ తో జరిగిన ఆఖరి టీ-20లో తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. 31 బంతుల్లో 70 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో మ్యాక్సీ కొట్టిన ఓ సిక్స్ తో మైదానంలోని సీటుకు బొక్కపడింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడిన మ్యాక్సీ.. అతను వేసిన ఓ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో సాయంతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అయితే ఈ రెండు సిక్స్‌ల్లో ఓ సిక్స్‌కు వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పేస్ స్టేడియం సీటుకు బొక్కపడింది. మ్యాక్సీ సెన్సేషన్ బ్యాటింగ్‌తో సీటుకు బొక్కపడటంతో ఆ సీటును చారిటీ కోసం న్యూజిలాండ్ వేలం వేయనుంది. ఆ సీటుపై మ్యాక్సీతో సంతకం కూడా చేయించింది. దీనికి సంబంధించిన ఫొటోలను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారాయి. మ్యాక్సీ విధ్వంసానికి అండగా ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. మ్యాక్సీతో పాటు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(69), జోష్ ఫిలిప్‌(43) రాణించారు. కివీస్‌ బౌలర్లలో టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ చెరో వికెట్‌ తీయగా, ఇష్ సోధి రెండు వికెట్లు పడగొట్టాడు.

    అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన కివీస్‌ 17.1 ఓవర్లలో 144 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టకుంది. ఆష్టన్‌ అగర్‌ 6 వికెట్లతో చెలరేగగా, మెరెడిత్‌ రెండు, ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ ఖాతా తెరించింది. కివీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.








    మరోవైపు, ఐపీఎల్ సీజన్ ముందు గ్లేన్ మ్యాక్స్ వెల్ సూపర్ షోతో రాణించడం పట్ల ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్‌లో పంజాబ్ తరఫున దారుణంగా విఫలమైన మ్యాక్సీ.. ఈ సీజన్ మినీ వేలంలో ఆర్‌సీబీ రూ. 14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మ్యాక్స్ వెల్ ప్రదర్శనను కొనియాడుతూ ఆర్సీబీ ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లు కురిపించింది. స్టన్నింగ్‌ పర్ఫామెన్స్‌తో చెలరేగి ఆస్ట్రేలియాకు అద్బుత విజయాన్నందించాడని కొనియాడింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. కరోనా ఎఫెక్ట్ తో టోర్నీ వేదికలపై కన్ఫూజన్ లో ఉంది బీసీసీఐ.
    Published by:Sridhar Reddy
    First published: