GLENN MAXWELL IN RELATIONSHIP WITH INDIAN GIRL VINI RAMAN MS
ఆమెతో పీకల్లోతు ప్రేమలో.. భారతీయ యువతితో మ్యాక్స్‌వెల్ డేటింగ్
విని రామన్‌తో మ్యాక్స్‌వెల్
ప్రస్తుతం డేటింగ్లో ఉన్న ఈ ఇద్దరు పెళ్లి గురించి మాత్రం ఇంకా ఏం మాట్లాడట్లేదట. బహుశా త్వరలోనే పెళ్లి ప్రకటన చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఓ భారతీయ యువతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ప్రస్తుతం ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు.ఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని సమాచారం.భారత సంతతికి చెందిన ఆ అమ్మాయి పేరు విని రామన్.ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన రామన్‌కు మ్యాక్స్‌వెల్‌తో ఎలా పరిచయమైందో తెలియదు కానీ..వీరిద్దరి బంధం ఇప్పుడు ఫెవికాల్ అంత స్ట్రాంగ్‌గా ఉందన్న కథనాలు వస్తున్నాయి.ప్రస్తుతం డేటింగ్లో ఉన్న ఈ ఇద్దరు పెళ్లి గురించి మాత్రం ఇంకా ఏం మాట్లాడట్లేదట.బహుశా త్వరలోనే పెళ్లి ప్రకటన చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.మ్యాక్స్‌వెల్-విని రామన్ జంట ఒక్కటైతే భారతీయ యువతిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్‌గా నిలుస్తాడు మ్యాక్స్‌వెల్.అంతకుముందు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ కూడా భారతీయ యువతినే పెళ్లాడాడు.
ఇక క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో లాంక్షైర్ తరుపున తన జోరు కొనసాగిస్తున్నాడు మ్యాక్స్‌వెల్.ఇటీవలి ప్రపంచకప్‌లో
మ్యాక్స్‌వెల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.దీంతో ఆస్ట్రేలియా ఫ్యాన్స్ నిరాశ చెందారు.