నెక్ట్స్ టార్గెట్ అదే... ‘కాశ్మీర్‌’పై అఫ్రిదీకి గంభీర్ కౌంటర్

కాశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టేలా అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలకు గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.

news18-telugu
Updated: August 6, 2019, 3:42 PM IST
నెక్ట్స్ టార్గెట్ అదే... ‘కాశ్మీర్‌’పై అఫ్రిదీకి గంభీర్ కౌంటర్
గౌతమ్ గంభీర్
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన అంశంపై పాకిస్థాన్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమతి తీర్మానం ప్రకారం కశ్మీరీలకు హక్కులు ఉండాలని అన్నాడు. అసలు ఐక్యరాజ్యసమితి నిద్రపోతుందా అని ప్రశ్నించాడు. మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీరీలపై బలవంతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉందని అన్నాడు.

అఫ్రిదీ కామెంట్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీరీలపై బలవంతంగా దాడులు జరుగుతున్నాయని షాహిద్ అఫ్రిదీ గుర్తించడం నిజంగా మంచిదే అని గంభీర్ అన్నాడు. అయితే ఈ క్రమంలో పాక్ ఆక్రమిక కాశ్మీర్ అనే విషయాన్ని ప్రస్తావించడం అఫ్రిదీ మర్చిపోయినట్టున్నాడని సెటైర్ వేశాడు. అయినా ఈ విషయంలో ఎలాంటి బెంగ పడొద్దని... త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కారమవుతుందని పరోక్షంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ తమ నెక్ట్స్ టార్గెట్ అనే విధంగా వ్యాఖ్యానించాడు.మొత్తానికి గంభీర్ పేర్కొన్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తదుపరి అడుగులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే పడతాయేమో చూడాలి.
First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>