Home /News /sports /

GAUTAM GAMBHIR ON AFRIDI GAME CHANGER BOOK MK

అఫ్రిదీని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా... గంభీర్ కౌంటర్

గౌతమ్ గంభీర్(ఫైల్ ఫోటో)

గౌతమ్ గంభీర్(ఫైల్ ఫోటో)

మెడికల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీలకు భారత్ వీసాలు జారీ చేస్తుందని, ఆ కోటాలో భారత్‌కు వస్తే స్వయంగా తానే మానసిక నిపుణుడి వద్దకు తీసుకుపోతానని గంభీర్ చురకలు అంటించాడు. అలాగే అఫ్రిదీ ఒక వింత మనిషి అని ఎద్దేవా చేశారు.

    పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఆటో బయోగ్రఫీ పుస్తకం గేమ్ చేంజర్ వివాదాల పుట్టగా మారింది. తాజాగా భారత క్రికెటర్ ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కు వ్యక్తిత్వం లేదని, కేవలం వివాదాల ద్వారా వార్తల్లో నిలవాలనే ప్రయత్నం చేస్తుంటాడని అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. దీనిపై గౌతమ్ గంభీర్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. మెడికల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీలకు భారత్ వీసాలు జారీ చేస్తుందని, ఆ కోటాలో భారత్‌కు వస్తే స్వయంగా తానే మానసిక నిపుణుడి వద్దకు తీసుకుపోతానని గంభీర్ చురకలు అంటించాడు. అలాగే అఫ్రిదీ ఒక వింత మనిషి అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ పుస్తకంలో అఫ్రీది తన వయస్సుతో పాటు, వివాదాస్పద కశ్మీర్ అంశాన్ని కూడా పుసక్తంలో లేవనెత్తాడు.
    First published:

    Tags: Cricket, Gautam Gambhir, India VS Pakistan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు