ఢిల్లీ కేపిటల్స్‌పై గంభీర్ కన్ను... కొనేస్తాడా...

Gautam Gambhir : క్రీడల్లోంచీ రాజకీయాల్లోకి వచ్చి రాణించేవాళ్లు తక్కువే. ఢిల్లీలో బీజేపీ ఎంపీగా గెలిచిన గౌతమ్ గంభీర్ మాత్రం ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూ... రాజకీయాల్ని బాగా వంటబట్టించుకున్నాడు. తాజాగా అతని కన్ను ఢిల్లీ కేపిటల్స్‌పై పడినట్లు తెలిసింది.

news18-telugu
Updated: December 7, 2019, 7:32 AM IST
ఢిల్లీ కేపిటల్స్‌పై గంభీర్ కన్ను... కొనేస్తాడా...
ఢిల్లీ కేపిటల్స్‌పై గంభీర్ కన్ను... కొనేస్తాడా...
  • Share this:
Gautam Gambhir : క్రీడల్లోంచీ వచ్చిన బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్... క్రీడల్ని వదల్లేకపోతున్నాడు. 2018 IPL సీజన్‌లోనే ఢిల్లీ కేపిటల్స్‌లో వాటా కొనాలనుకున్నాడు. ఐతే... అప్పట్లో చర్చలు జరిపేందుకు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కి వీలుకాలేదు. ఇప్పుడు ఈ తూర్పు ఢిల్లీ ఎంపీ... GMR గ్రూప్‌తో చర్చలు జరిపి... షేర్లు కొంటాడని తెలుస్తోంది. ఢిల్లీ కేపిటల్స్‌లో 50 శాతం వాటాల్ని JSW గ్రూప్... రూ.550 కోట్లు పెట్టి గతేడాది కొనేసింది. మిగతా 50 శాతం GMR చేతిలో ఉన్నాయి. ఇప్పుడా 50 శాతంలో 10 శాతాన్ని గౌతమ్ గంభీర్ కొనబోతున్నట్లు తెలుస్తోంది. వాటి విలువ రూ.100 కోట్ల దాకా ఉంటుంది. ఈ డీల్ కుదుర్చుకోవాలంటే IPL గవర్నింగ్ కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వాలి. దాని కోసమే గంభీర్ ఎదురుచూస్తున్నాడు.

గంభీర్ మామూలోడు కాదు. IPLలో విజయవంతమైన కెప్టెన్లలో అతనూ ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి రెండుసార్లు టైటిల్స్ తెచ్చిపెట్టాడు. ఢిల్లీ తరపున రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. అందులో రెండో టోర్నమెంట్ అతని కెరీర్‌లో చివరిది అయ్యింది. IPL 2019లో ఢిల్లీ కేపిటల్స్ థర్డ్ రౌండ్‌లో నిలిచింది. ఇప్పుడా జట్టులో షేర్ కొంటే... గంభీర్ కూడా సలహాలూ, సూచనలూ ఇస్తూ... జట్టును ముందుకు నడిపే అవకాశాలుంటాయి. తన కెరీర్‌లో ఢిల్లీ తరపున ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన గంభీర్... కెప్టెన్‌గా కూడా ఎక్కువకాలం కొనసాగాడు. అందుకే ఇప్పుడు ఢిల్లీ కేపిటల్స్‌పై ఫోకస్ పెట్టాడు.

 

Pics : అందాల చందమామ అవనీత్ కౌర్ క్యూట్ ఫొటోస్


 

ఇవి కూడా చదవండి :వొడాఫోన్-ఐడియా మూతపడబోతోందా?... ఏం జరుగుతోంది?

ఉన్నావ్‌ రేప్ బాధితురాలు మృతి... దర్యాప్తుకి సిట్ ఏర్పాటు

జగన్ విషయంలో కేంద్రం తప్పు చేస్తోందా... ఢిల్లీ ప్లాన్ ఏంటి?

ఏ క్షణమైనా వాళ్లకు ఉరి... రెడీ అవుతున్న కేంద్రం

చలికాలంలో కిస్‌మిస్ తింటున్నారా... ఇవీ కలిగే ప్రయోజనాలు
First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>