ధోనీపై మాజీ క్రికెటర్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gautam gambhir on MS Dhoni | ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా తన కెరీర్‌పై ధోనీ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని గౌతమ్ గంభీర్ సూచించాడు.

news18-telugu
Updated: July 19, 2019, 2:25 PM IST
ధోనీపై మాజీ క్రికెటర్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీతో గంభీర్(ఫైల్ ఫోటో)
  • Share this:
టీమిండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో కుర్రాళ్లకు ఎక్కువగా చాన్సులు ఇచ్చేవాడని గంభీర్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ సిరీస్ లో సెహ్వాగ్, సచిన్ లతో పాటు తనను కూడా పక్కనబెట్టాలనుకున్నాడని గంభీర్ వెల్లడించాడు. అయితే యువ ఆటగాళ్ల కోసమే ధోనీ అలాంటి నిర్ణయం తీసుకున్నాడని వివరించాడు. ప్రస్తుతం ధోనీ క్రికెటర్ కెరీర్ చరమాంకంలో ఉండటం... అతడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తుండటంపై గౌతమ్ గంభీర్ స్పందించాడు.

ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా తన కెరీర్‌పై ధోనీ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. టీమిండియాకు దొరికిన వికెట్ కీపర్లలో ధోనీ బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్న గంభీర్... తదుపరి వరల్డ్ కప్ కోసం మంచి వికెట్ కీపర్,బ్యాట్స్ మన్ ఎంపిక చేయడానికి ఇదే సరైన తరుణమని అన్నాడు. తన దృష్టిలో ఫ్యూచర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ రేసులో ఉన్నారని వెల్లడించాడు. వారికి మంచి అవకాశాలు ఇచ్చి పరీక్షించాలని జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఒక్కొక్కరికి ఒకటిన్నర ఏడాది పాటు అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.


First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>