ఆ సంఘటన చాలు ధోనీ అంటే ఏంటో చెప్పడానికి: గ్యారీ కిర్‌స్టెన్‌

ధోనీ ఎంతో నమ్మకమైన వ్యక్తి అని భారత్‌కు చీఫ్ కోచ్‌గా పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉండేదన్నారు. తాజాగా ‘ది ఆర్కే షో’లో పాల్గోన్న కిర్‌స్టెన్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Rekulapally Saichand
Updated: July 16, 2020, 4:01 PM IST
ఆ సంఘటన చాలు ధోనీ అంటే ఏంటో చెప్పడానికి: గ్యారీ కిర్‌స్టెన్‌
ధోనీతో విరాట్ కోహ్లీ(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టీమిండియా మాజీ సారథి ధోనీపై ప్రశంసల జల్లు కురిపించారు సఫారి ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్‌. ధోనీ ఎంతో నమ్మకమైన వ్యక్తి అని భారత్‌కు చీఫ్ కోచ్‌గా పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉండేదన్నారు. తాజాగా ‘ది ఆర్కే షో’లో పాల్గోన్న కిర్‌స్టెన్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ధోనీతో తనకు ఉన్న అనుబంధంతో పాటు 2011 ప్రపంచకప్‌కు సంబంధించిన సంఘటలను ఆ చిట్ చాట్ బయటపెట్టారు.

తను చూసిన ఆటగాళ్ళలలో ఎమ్‌ఎస్ భిన్నమైన మనసతత్వం కలిగిన వ్యక్తి అని, చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పానన్నారు, అత్యధిక  ప్రేక్షాధరణ కలిగిన నాయకుడిగా నిలిచిపోయాడన్నాడు. 2011 ప్రపంచ కప్ సమయంలో టీమిండియా బెంగుళూరులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న  ఓ స్కూల్‌ను సందర్శించడానికి మాకు ఆహ్వానం అందింది. అయితే భద్రతా కారణాల రిత్యా విదేశీయులను అనుమతించబోమన్నారు. నాతో పాటు జట్టుతో పాడీ ఆప్టన్‌, ఎరిక్‌ సిమ్మన్స్‌ కొంత నిరాశకు చెందాం. అప్పుడు దోనీ చేప్పిన ఇప్పటికి నాకు గుర్తున్నాయి. 'ఆ ముగ్గురు నా వాళ్ళు.. వీళ్ళు రాకపోతే మేం అక్కడికి రామన్నారు'. ఈ ఒక్క సంఘటన చాలు ధోనీ వ్యక్తిత్వం ఏమిటో చెప్పాడానికి" అంటూ అనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
Published by: Rekulapally Saichand
First published: July 16, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading