ICC : ఐసీసీ మీటింగ్‌కు గంగూలీ, జైషా గైర్హాజరు.. ఎందుకో కారణం చెప్పిన రాజీవ్ శుక్లా.. అజెండా ఇదే..!

ఐసీసీ మీటింగ్‌కు వాళ్లిద్దరూ వెళ్లడం లేదు.. కారణం ఇదే!

టీ20 వరల్డ్ కప్ ఫేట్ జూన్ 1న జరిగే ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో తెలిసిపోనున్నది. ఇప్పటికీ బీసీసీఐ తామే ఆతిథ్యం ఇస్తామని చెబుతుండగా.. కరోనా కారణంగా మ్యాచ్‌లు సక్రమంగా నిర్వహిస్తారా అని ఐసీసీ అనుమానం వ్యక్తం చేస్తున్నది.

 • Share this:
  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) (ICC) ఎగ్జిక్యూటీవ్ కమిటీ జూన్ 1 (మంగళవారం) దుబాయ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరుగనున్నది. ఐసీసీ సమావేశంలోని అజెండాలో పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ప్రధాన అంశంగా ఉన్నది. ఇండియా వేదికగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 14 వరకు టోర్నీ నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల ఐపీఎల్ 2021 అర్దాంతరంగా వాయిదా పడటంతో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఐపీఎల్‌ను యూఏఈకి తరలించడంతో బీసీసీఐ (BCCI) ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈ నెల 29న జరిగిన బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో వరల్డ్ కప్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తమకు నెల రోజుల గడువు కోసం ఐసీసీని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఐసీసీలో బీసీసీఐ ప్రతినిధి రాజీవ్ శుక్లాతో పాటు అధ్యక్షుడు గంగూలీ (Ganguly), కార్యదర్శి జై షా (Jay Shah) కూడా హాజరవుతారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న రాజీవ్ శుక్లా 'ఖలీజ్ టైమ్స్' పత్రికతో మాట్లాడుతూ.. ఐసీసీ సమావేశానికి తాను ఒక్కడినే హాజరవుతున్నట్లు చెప్పారు. టీ20 వరల్డ్ కప్ విషయంలో ప్రత్యేక సాధారణ సమావేశంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్నే తాను ప్రతిపాదించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గంగూలీ, జైషాలు ఐసీసీ సమావేశానికి ఆన్‌లైన్ ద్వారా హాజరవుతారని ఆయన చెప్పారు.

  ఐసీసీ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యంలో పాటు ఒక వేళ కరోనా కారణంగా ఈవెంట్‌ను తరలించాల్సి వస్తే ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపై కూడా చర్చ జరుగనున్నది. యూఏఈని కనుక వేదికగా నిర్ణయిస్తే హోస్ట్స్‌గా ఎవరు ఉంటారనే విషయంపై ఐసీసీ నిర్ణయం తీసుకోనున్నది. మరోవైపు ఐసీసీ, బీసీసీఐ మధ్య పన్ను రాయితీలకు సంబంధించిన వివాదం నడుస్తున్నది. వరల్డ్ కప్ నిర్వహిస్తే భారత ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలను ఇప్పించాలని బీసీసీఐని ఐసీసీ కోరింది. 2016లో నిర్వహించిన టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన పన్ను రాయితీల విషయమే ఇప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో ఐసీసీ నుంచి 30 మిలియన్ డాలర్ల షేర్ ఇంకా బీసీసీఐకి అందలేదు. ఇది కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.

  ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఏన్నో ఏళ్లుగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2012-13 సీజన్ నుంచి ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు, అభిమానులు, విలేఖరులకు వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన 9 వేదికల్లో ముంబై కూడా ఉన్నది. అక్కడ మ్యాచ్ ఆడటానికి పాకిస్తాన్ జట్టు కనుక వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఐసీసీ ఆలోచిస్తున్నది. బీసీసీఐ తగినంత రక్షణ కల్పిస్తారా లేదా అనే దానిపై ఐసీసీకి భరోసా ఇవ్వాల్సి ఉంటుంది.

  WTC Final : వామ్మో.. ఆ అంపైర్ వద్దే వద్దు.. అతడుంటే ఇండియా ఓడిపోవడం ఖాయం.. ఇవిగో రుజువులు
   మరోవైపు యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరపడానికి బుధవారం గంగూలీ, జైషాతో పాటు ఇతర బీసీసీఐ ఆఫీస్ బేరర్లు యూఏఈ రానున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. ఐపీఎల్ నిర్వహణకు కావలసిన అనుమతులు, ఇతర లాజిస్టిక్స్ ఏర్పాట్ల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
  Published by:John Naveen Kora
  First published: