హోమ్ /వార్తలు /క్రీడలు /

David Warner : భారతీయుల మనసులను మరోసారి గెల్చుకున్న డేవిడ్ బాయ్.. ఇండియాలో సెటిల్ అయిపో

David Warner : భారతీయుల మనసులను మరోసారి గెల్చుకున్న డేవిడ్ బాయ్.. ఇండియాలో సెటిల్ అయిపో

PC : David Warner/Instagram

PC : David Warner/Instagram

David Warner : తాగుబోతు.. క్రమశిక్షణ తెలియదు.. సొంత ప్లేయర్లతోనే గొడవకు దిగుతాడు.. కోపం వస్తే ప్రత్యర్థి ప్లేయర్లను కొడతాడు.. బాల్ ట్యాంపర్ (Ball Tampering).. ఒక్కటేంటి అడుగడుగునా వివాదాలే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇందంతా ఆస్ట్రేలియా (Australia) స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) గతం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

David Warner : తాగుబోతు.. క్రమశిక్షణ తెలియదు.. సొంత ప్లేయర్లతోనే గొడవకు దిగుతాడు.. కోపం వస్తే ప్రత్యర్థి ప్లేయర్లను కొడతాడు.. బాల్ ట్యాంపర్ (Ball Tampering).. ఒక్కటేంటి అడుగడుగునా వివాదాలే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇందంతా ఆస్ట్రేలియా (Australia) స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) గతం. గతంలో వార్నర్ చేసినంత రచ్చ మరో క్రికెటర్ చేసి ఉండడు. అయితే వార్నర్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత నిషేధానికి గురైన అతడు..  మారిన మనిషిలా తిరిగి క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరితోనూ గొడవకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ద్వారా డేవిడ్ వార్నర్ భారత ప్రజలకు మరింత దగ్గరయ్యాడు.ఇది కూడా చదవండి : ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో హార్దిక్ హవా.. ఒక్క మ్యాచ్ తో ఏకంగా కెరీర్ బెస్ట్ కు.. ఎన్నో స్థానంలో ఉన్నాడంటే?
డిల్లీ డేర్ డెవిల్స్ తో ఉన్నప్పుడు వార్నర్ ను భారతీయులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడో.. అప్పటి నుంచి వార్నర్ వెనుదిరిగి చూసుకోలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు వార్నర్ ను భారతీయుడిలానే చూశాడు. ఇంకా చెప్పాలంటే ఒక హైదరాబాదీలా చూశారు. తెలుగు ప్రజలు వార్నర్ ను తమ గుండెల్లో పెట్టుకున్నాడు. హైదరాబాద్ స్టయిల్ లో డేవిడ్ భాయ్ అంటూ ప్రేమగా పిలుచుకున్నారు. ఇక 2016 ఐపీఎల్ లో సన్ రైజర్స్ ను చాంపియన్ గా నిలబెట్టడంతో వార్నర్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక నిషేధం తర్వాత వార్నర్ తెలుగు సినిమా పాటలకు ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేస్తూ తెలుగు ప్రజలకు మరింతగా దగ్గరయ్యాడు. ఇక తాజాగా వార్నర్ భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు. వినాయకుడిని ప్రార్థిస్తూ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
ఇక ఈ పోస్ట్ ను చూసిన భారతీయులు వార్నర్ కు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు ప్రజలు అయితే ఇండియాలో సెటిల్ అవ్వూ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వార్నర్ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ లో పాల్గొంటున్నాడు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ వేదికగా జరిగే మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఆడే ఆస్ట్రేలియా జట్టుతో పాటు భారత్ కు రానున్నాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, David Warner, Delhi Capitals, Ganesh Chaturthi​, Ganesh Chaturthi​ 2022, IPL, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు