అప్పుడు ధోని కూడా అదే చేశాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన గంభీర్..

MS Dhoni: కొత్త వికెట్ కీపర్లకు అవకాశం ఇవ్వాలని చెబుతూ.. ధోనిని ఇక సాగనంపాలి అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 19, 2019, 2:56 PM IST
అప్పుడు ధోని కూడా అదే చేశాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన గంభీర్..
మహేంద్రసింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ (ఐపీఎల్ ఫోటోలు)
  • Share this:
ధోని రిటైర్మెంట్ ఎప్పుడు? క్రికెట్ గురించి తెలిసిన చిన్న పిల్లాడి దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ అడుగుతున్న ప్రశ్న. ధోనినే స్వయంగా నోరు తెరిచి చెబితే తప్ప తోటి క్రికెటర్లు, బీసీసీఐ పెద్దలు కూడా ఏం చెప్పలేనంత పెద్ద ప్రశ్న ఇది. ఎవరికి వారు అతడి రిటైర్మెంట్ గురించి ఊహించుకుంటున్నారిప్పుడు. మిస్టర్ కూల్ మరికొన్ని రోజులు కొనసాగాలని కొందరు మాజీలు కోరుతుండగా, ఇంకొందరు త్వరగా రిటైర్ అయ్యి యువకులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆట ఆడలేనప్పుడు తప్పుకోవాలని నిర్మొహమాటంగా చెబుతున్న వారూ ఉన్నారు. తాజాగా, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ధోని రిటైర్మెంట్‌పై పరోక్షంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొత్త వికెట్ కీపర్లకు అవకాశం ఇవ్వాలని చెబుతూ.. ధోనిని ఇక సాగనంపాలి అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

‘వచ్చే 2023 వరల్డ్ కప్ కోసం వికెట్ కీపర్‌ను సిద్ధం చేయాలి. టీమ్ అవసరాల దృష్ట్యా యువకులకు అవకాశం ఇవ్వాలి. అది రిషబ్ పంత్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్.. లేదా మరొకరైనా సరే.. ఛాన్స్ ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు అవకాశం ఇవ్వాలి. రాణించలేకపోతే మరొకరికి జట్టులోకి తీసుకోవాలి. చివరికి ఒకటే.. వచ్చే వరల్డ్ కప్‌కు ఎవరు సిద్ధంగా ఉంటారన్నదే ముఖ్యం’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో జరిగిన సీబీ సిరీస్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘ఆ సమయంలో తనను, సెహ్వాగ్, సచిన్ ఆడటం లేదని ధోని స్పష్టం చేశాడు. అక్కడి గ్రౌండ్లు పెద్దవిగా ఉంటాయని చెప్పాడు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అప్పుడు కెప్టెన్‌గా ఉన్న ధోని అలా ఆలోచించి ఉండవచ్చు. నిజమే.. భావోద్వేగం కన్నా ప్రాక్టికల్‌గా ఆలోచించడమే ఉత్తమం. ఇప్పుడు కూడా అదే చేయాలి’ అని తెలిపాడు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>