FUNNY CRICKET BATTING TEAM MADE 3 RUNS FOR DOT BALL VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA SJN
Viral Cricket : క్రికెట్ లో ఇలాంటివి కూడా జరుగుతాయా.! డాట్ బాల్ కు ఏకంగా మూడు పరుగులు.. కావాలంటే మేరే చూడండి
(PC : TWITTER)
Viral Cricket : క్రికెట్ (Cricket) లో మూడు పరుగులు చేయడం సర్వ సాధారణం. అదే డాట్ బాల్ కు మూడు పరుగులు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? చూసే అవకాశమే లేదు. కానీ, చెక్ రిపబ్లిక్ (czech republic) వేదికగా జరుగుతోన్న ఒక క్రికెట్ టోర్నీలో ఈ వింత చోటు చేసుకుంది.
Viral Cricket : క్రికెట్ (Cricket) లో మూడు పరుగులు చేయడం సర్వ సాధారణం. అదే డాట్ బాల్ కు మూడు పరుగులు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? చూసే అవకాశమే లేదు. కానీ, చెక్ రిపబ్లిక్ (czech republic) వేదికగా జరుగుతోన్న ఒక క్రికెట్ టోర్నీలో ఈ వింత చోటు చేసుకుంది. బంతిని బ్యాట్ తో టచ్ చేయకుండానే బ్యాటింగ్ టీం ఏకంగా మూడు పరుగులు తీసేసింది. అది కూడా కీపర్ చేతిలోకి వెళ్లాక మూడు పరుగులు చేయడం విశేషమే కదా. చెక్ రిపబ్లిక్ క్రికెట్ లీగ్ లో భాగంగా ప్రాగ్ బార్బేరియన్స్, వినహ్రడీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన బార్బేరియన్స్ బ్యాటింగ్ కు దిగింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ల అద్భుత సంఘటన చోటు చేసుకుంది.
ఆ ఓవర్ లో వినహ్రడీ బౌలర్ బంతిని ఆఫ్ స్టంప్ కు దూరంగా వేశాడు. షాట్ ఆడే క్రమంలో బార్బేరియన్స్ ప్లేయర్ మిస్ అయ్యాడు. క్రీజును వదిలి ముందుకు రావడంతో కీపర్ అతడిని స్టంపౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది సఫలం కాలేదు. అదే సమయంలో నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. కీపర్ బంతిని అందుకుని రనౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. అది కాస్తా మిస్ కాగా.. బార్బేరియన్స్ బ్యాటర్స్ మరో పరుగు కోసం ప్రయత్నించారు. ఈసారి కూడా ఈజీ రనౌట్ ను ఫీల్డింగ్ జట్టు మిస్ చేసుకుంది. మళ్లీ ఓవర్ త్రోకాగా బార్బేరియన్స్ ప్లేయర్స్ మూడో పరుగు తీసేశారు.
They sneaked in 3️⃣ runs out of nowhere!!????????. @Brad_Hogg
— Md Asiqul Islam ???????? (@MdAsiqulIslam6) June 9, 2022
వాళ్లు మైదానంలో సీరియస్ గానే చేసినా చూసిన వాళ్లు ఫక్కున నవ్వక మానరు. అలా ఉంది మరి వాళ్ల కామెడీ క్రికెట్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మైదానం చిత్తడి చిత్తడిగా ఉండటంతో బంతి ఒకచోట ఆగిపోయింది. లేదంటే నాలుగో పరుగు కూడా తీసేవారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియోపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. ’సిమ్ బ్యాట్ ను ఉపయోగిస్తూ రన్ తీసి ఉంటే.. నాలుగు పరుగులు ఈజీగా వచ్చేవి‘ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.