అల్లరే అల్లరి.. ధోని కూతురితో రిషబ్ పంత్ సందడి..

జీవాతో సందడి చేసిన వీడియోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పంత్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే లక్ష పైచిలుకు మంది వీక్షించారు.

news18-telugu
Updated: June 17, 2019, 6:02 PM IST
అల్లరే అల్లరి.. ధోని కూతురితో రిషబ్ పంత్ సందడి..
జీవా, రిషబ్ పంత్ (Image : Instagram)
  • Share this:
భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కీపర్ మహేంద్ర సింగ్ ధోని కూతురు జీవాతో కలిసి తెగ అల్లరి చేశాడు క్రికెటర్ రిషబ్ పంత్. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ ధావన్ గాయపడటంతో అతని స్థానంలో పంత్ లండన్ రావాల్సి వచ్చింది. అధికారికంగా జట్టుతో జాయిన్ కానప్పటికీ.. పంత్ టీమిండియాతో కలిసే పర్యటిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఆదివారం భారత్-పాక్ మధ్య మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌కు అతను హాజరయ్యాడు. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించిన అతను..మధ్య మధ్యలో ధోని కూతురు జీవాతో కలిసి అల్లరి చేశాడు. జీవా,పంత్ ఇద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూస్తూ గట్టిగా అరుస్తూ సందడి చేశారు.

జీవాతో సందడి చేసిన వీడియోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పంత్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే లక్ష పైచిలుకు మంది వీక్షించారు.ఇదిలా ఉంటే, పంత్ ఆడేది లేనిది ధావన్ పరిస్థితిపై ఆధారపడి ఉంది.ఒకవేళ ధావన్ గాయం నుంచి త్వరగా బయటపడితే.. జట్టుతో తిరిగి చేరనున్నాడు. అప్పటివరకు పంత్ టీమిండియాతోనే పర్యటించనున్నాడు.

View this post on Instagram

Partners in crime 😈 @ziva_singh_dhoni

A post shared by Rishabh Pant (@rishabpant) on

First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading