Home /News /sports /

IPL Retentions 2022: సీనియర్ల జీతంలో కోత.. పెరిగిన జూనియర్ల రెమ్యునరేషన్.. అప్పుడెంత? ఇప్పుడెంత? మిగిలిన పర్స్ వాల్యూ ఎంత?

IPL Retentions 2022: సీనియర్ల జీతంలో కోత.. పెరిగిన జూనియర్ల రెమ్యునరేషన్.. అప్పుడెంత? ఇప్పుడెంత? మిగిలిన పర్స్ వాల్యూ ఎంత?

ఏ ప్లేయర్ జీతం ఎంత? ఫ్రాంచైజీల వద్ద మిగిలిన పర్స్ వాల్యూ ఎంత? (PC: IPL)

ఏ ప్లేయర్ జీతం ఎంత? ఫ్రాంచైజీల వద్ద మిగిలిన పర్స్ వాల్యూ ఎంత? (PC: IPL)

IPL 2022 Retentions: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు ముందు పాత 8 జట్ల ప్లేయర్ రిటెన్షన్స్ మంగళవారం పూర్తయ్యాయి. అన్ని ఫ్రాంచైజీలు తాము ఎవరిని రిటైన్ చేసుకుంటున్నామో వెల్లడించాయి. ఇందులో చాలా మంది సీనియర్ క్రికెటర్ల జీతాల్లో కోత పడగా... అన్‌క్యాప్డ్ ప్లేయర్స్, జూనియర్ల జీతాలు మాత్రం పెరిగాయి.

ఇంకా చదవండి ...
    క్రికెట్ (Cricket) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2022కి (IPL 2022) సంబంధించిన ప్లేయర్స్ రిటెన్షన్స్ (Player Retentions) పూర్తయ్యాయి. అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షల్లపై తీవ్రమైన కసరత్తు చేసినట్లే కనపడుతున్నది. సీనియర్ ప్లేయర్లకే దాదాపు ఫ్రాంచైజీలన్నీ పెద్దపీఠ వేశాయి. అదే సమయంలో కొంత మంది యువ ప్లేయర్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కూడా లక్కీ చాన్స్ కొట్టేశారు. బీసీసీఐ (BCCI) రిటెన్షన్స్ రూల్స్‌ను అనుసరించి జీతాలు నిర్ణయించడంతో సీనియర్లలో కొంత మందికి కోత పడగా.. జూనియర్లు మాత్రం భారీగా లాభపడ్డారు. కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో ప్రత్యేకంగా డీల్స్ చేసుకోవడంతో బీసీసీఐ నిర్ణయించిన స్లాబ్‌లో తీసుకున్నా.. జీతాలు మాత్రం తక్కువ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయి. తాజా రిటెన్షన్స్ తర్వాత రోహిత్ శర్మ జీతం గతంలో కంటే రూ. 1 కోటి పెరిగింది. అదే సమయంలో కోహ్లీ జీతం రూ. 2 కోట్లు, ధోనీ జీతం రూ. 3 కోట్ల మేర కోత పడింది.

    మరోవైపు కొన్ని ఫ్రాంచైజీల్లో స్టార్ క్రికెటర్లను రిటైన్ చేసుకోవాలని యాజమాన్యం అనుకున్నా వాళ్లు నిరాకరించారు. దీంతో కొంత మంది యువకులు, అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. గతంలో బేస్ ప్రైజ్‌కు అమ్ముడు పోయిన ఈ క్రికెటర్లకు ఇప్పుడు రూ. కోట్లు జీతంగా లభించనున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో కొనసాగడానికి కేఎల్ రాహుల్ నిరాకరించాడు. దీంతో ఆ జట్టు కేవలం ఇద్దరినే రిటైన్ చేసుకుంది. మయాంక్ అగర్వాల్‌తో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ రిటైన్ అయ్యారు. అర్షదీప్‌కు గతంలో రూ. 20 లక్షలు చెల్లించగా.. ఇప్పుడు రూ. 4 కోట్లు జీతంగా అందనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను తక్కువ ధరకే గతంలో తీసుకున్నారు. ఇప్పుడు ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఇద్దరికీ చెరో రూ. 4 కోట్లు ఖాతాలో చేరనున్నాయి. కేన్ విలియమ్‌సన్ జీతం రూ. 3 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ. 14 కోట్లకు చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలో ఎన్రిక్ నోర్జేను వేలంలో రూ. 89.82 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా రూ. 6.5 కోట్లు చెల్లించబోతున్నది.

    Cricket: కెరీర్‌ను అత్యంత విషాదకరంగా ముగించిన క్రికెటర్లు వీళ్లే.. కెరీర్ అద్భుతమైనా.. ఎండింగ్ బాధకరం


    రిటైన్ ఆటగాళ్ల ప్రస్తుతం జీతం ఎంత? గతంలో జీతం ఎంత?



































































































































































































































    వరుస క్రమం ఆటగాడు ఫ్రాంచైజీ గత జీతం (రూపాయిల్లో) ప్రస్తుత జీతం (రూపాయిల్లో) నోట్
    1 విరాట్ కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17కోట్లు 15కోట్లు
    2 గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14.25 కోట్లు 11 కోట్లు
    3 మహ్మద్ సిరాజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లు 7 కోట్లు
    4 రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ 15 కోట్లు 16 కోట్లు
    5 జస్ప్రిత్ బుమ్రా ముంబై ఇండియన్స్ 7 కోట్లు 12 కోట్లు
    7 సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ 3.2 కోట్లు 8 కోట్లు
    8 కిరాన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ 5.4 కోట్లు 6 కోట్లు
    9 మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ 1 కోటి 12 కోట్లు ఫ్రాంచైజీ పర్స్ వాల్యూలో రూ. 14 కోట్లు కట్ అవుతాయి.
    10 అర్ష్ దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ 20 లక్షలు 4 కోట్లు అన్‌క్యాప్డ్ ప్లేయర్
    11 కేన్ విలియమ్‌సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 కోట్లు 14 కోట్లు
    12 అబ్దుల్ సమద్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 లక్షలు 4 కోట్లు అన్‌క్యాప్డ్ ప్లేయర్
    13 ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 లక్షలు 4 కోట్లు అన్‌క్యాప్డ్ ప్లేయర్
    14 రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ 7 కోట్లు 16 కోట్లు
    15 మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ 15 కోట్లు 12 కోట్లు
    16 మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్ 7 కోట్లు 8 కోట్లు
    17 రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ 40 లక్షలు 6 కోట్లు
    18 రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ 15 కోట్లు 16 కోట్లు
    19 అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ 5 కోట్లు 9 కోట్లు పర్స్ వాల్యూలో రూ. 12 కోట్లు కట్ అవుతాయి
    20 పృథ్వీషా ఢిల్లీ క్యాపిటల్స్ 1.2 కోట్లు 7.5 కోట్లు పర్స్ వాల్యూలో రూ. 8 కోట్లు కట్ అవుతాయి
    21 ఎన్రిక్ నోర్జే ఢిల్లీ క్యాపిటల్స్ 89.82 లక్షలు 6.5 కోట్లు
    22 ఆండ్రీ రస్సెల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 8.5 కోట్లు 12 కోట్లు పర్స్ వాల్యూలో రూ. 16 కోట్లు కట్ అవుతాయి
    23 వరుణ్ చక్రవర్తి కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 కోట్లు 8 కోట్లు పర్స్ వాల్యూలో రూ. 12 కోట్లు కట్ అవుతాయి.
    24 వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 లక్షలు 8 కోట్లు
    25 సునిల్ నరైన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 12.5 కోట్లు 6 కోట్లు
    26 సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ 8 కోట్లు 14 కోట్లు
    27 జాస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ 4.4 కోట్లు 10 కోట్లు
    28 యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ 2.4 కోట్లు 4 కోట్లు అన్‌క్యాప్డ్ ప్లేయర్

    ఇక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న తర్వాత ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత పర్స్ వాల్యూ మిగిలిందంటే..

    1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - రూ. 57 కోట్లు

    2. ముంబై ఇండియన్స్ - రూ. 48 కోట్లు

    3. పంజాబ్ కింగ్స్ - రూ. 72 కోట్లు

    4. సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ. 68 కోట్లు

    5. చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 48 కోట్లు

    6. ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 47.5 కోట్లు

    7. కోల్‌కతా నైట్‌రైడర్స్ - రూ. 48 కోట్లు

    8. రాజస్థాన్ రాయల్స్ - రూ. 62 కోట్లు

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, Chennai Super Kings, Delhi Capitals, IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians, Punjab kings, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు