Tokyo Olympics: రాకెట్ విరగ్గొటి.. మరొక రాకెట్ విసిరేసి.. రచ్చ రచ్చ చేసిన జకోవిచ్

మ్యాచ్ ఓడిపోయిన తర్వాత జకోవిచ్ చేసిన రచ్చ చూడండి (AFP)

మ్యాచ్ ఓడిపోయిన నోవాక్ జకోవిచ్ టెన్నిస్ కోర్టులో ప్రవర్తించిన తీరు ఇప్పుడు విమర్శల పాలవుతున్నది. గొప్ప ఆటగాడై ఉండి అలా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి.

  • Share this:
    'ఆటలన్నాక గెలుపోటములు సహజం. ఒడిపోయిన ఆటగాడు తర్వాత కష్టపడి తర్వాతి మ్యాచ్‌లకు సిద్దం కావాలి.' - అని కోచ్‌లు ప్రతీ ఆటగాడికి చెబుతుంటారు. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న ఆటగాడు ఓటమి చెందినప్పుడు ఎక్కువగా ఎమోషనల్ కాకూడదని, నిరుత్సాహ పడకూడదని చెప్తుంటారు. కానీ టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజ ఆటగాడైన నోవాక్ జకోవిచ్ (Novak Djokivic) తన సహనాన్ని కోల్పోతే ఎలా ఉంటుంది.? క్రీడా స్పూర్తికి (Sporting Spirit) విరుద్దగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? శనివారం అలాంటి పరిస్థితే అందరూ చూశారు. వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్, సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ శనివారం టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) మెన్స్ టెన్నిస్ విభాగంలో బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన బుస్టాపై ఓడిపోయాడు. స్వర్ణం గెలవాలని బరిలోకి దిగిన నోవాక్ జకోవిచ్ సెమీస్‌లో ఓడిపోయి మూడో స్థానం కోసం బుస్టాతో తలపడ్డాడు. కానీ బుస్టా అతడిిని 6-4, 6-7(6/8), 6-3 తేడాతో ఓడించి బ్రాంజ్ మెడల్ ఎగురేసుకొని పోయాడు. దీంతో జకోవిచ్ టోక్యో ఒలింపిక్స్ నుంచి పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, బుస్టాతో మ్యాచ్ ముగిసిన వెంటనే జకోవిచ్ తీవ్ర అసహనానికి (Frustration) గురయ్యాడు.

    ఓడిపోయిన బాధలో తీవ్ర ఆగ్రహంతో రాకెట్‌ను నెట్ పోల్‌కు కొట్టాడు. ఎంత బలంగా కొట్టాడంటే ఆ రాకెట్ విరిగిపోయింది. అంతే కాకుండా తన క్రీడా సామాగ్రి వద్దకు వెళ్లి ఇంకో రాకెట్‌ను స్టాండ్స్ మీదకు విసిరేశాడు. ఖాళీ స్టాండ్స్‌తో మ్యాచ్ నిర్వహిస్తున్నందున ఆ రాకెట్ ఎక్కడో పడిపోయింది. అదే ప్రేక్షకులు ఉండి ఉంటే వాళ్లకు తప్పకుండా గాయాలయ్యేవి. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఒలింపిక్స్ వంటి మెగా వేదక వద్ద జకోవిచ్ ప్రవర్తనపై అందరూ పెదవి విరుస్తున్నారు. ఒక ఆటగాడికి ఉండాల్సిన క్రీడా స్పూర్తి ఇది కాదని చెబుతున్నారు. జకోవిచ్ రాకెన్‌ను కట్టిన తీరుకు పక్కనే ఉన్న ఒక వ్యక్తి భయంతో పారిపోయాడంటే అతడి కోపం ఏ రేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు.





    కాగా.. ఆ తర్వాత జకోవిచ్ తన ప్రవర్తనపై వివరణ ఇచ్చాడు. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నాడు. 'నేను నా ఎమోషన్‌ను ఆపుకోలేకపోయాను. దాంతో నన్ను నేనుకంట్రోల్ చేసుకోలేక అలా చేశాను. ఇదేం మొదటి సారి కాదు.. అలాగే చివరి సారి కూడా కాబోదని అనుకుంటున్నాను. కానీ ఆటలో ఇది కూడా భాగమే.. ఇలాంటి విషయాలు నాకు కూడా చికాకు కలిగిస్తాయి. కానీ నా ప్రవర్తనకు చింతిస్తున్నాను. దయచేసి క్షమించండి.' అని చెప్పుకొచ్చాడు.
    Published by:John Naveen Kora
    First published: