French Open : టెన్నిస్ (Tennis) ఆటలో భావోద్వేగాలను అదుపు చేసుకోవడం చాలా కష్టం. అలా అదుపు చేసుకున్న ప్లేయర్సే.. ఆ తర్వాత అభిమానుల ఆరాధ్య ప్లేయర్స్ గా మారతారు. ప్రత్యర్థికి పాయింట్ కోల్పోయామనో.. లేక చైర్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడనో ఏదో ఒక కారణంతో కోర్టులో ప్లేయర్స్ తమ చేతిలోని రాకెట్ ను నేలకేసి కొట్టడం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఇది పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. తాజాగా ఓ ప్లేయర్ రాకెట్ పై చూపిన కోపం మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ పసివాడి కంటి చూపును పోగొట్టేంత పని చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ లో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో రష్యా (Russia)కు చెందిన అలెగ్జాండ్రోవా (Ekaterina Alexandrova)తో రుమేనియా (Romania) భామ ఐరినా కెమెలియా బెగూ (Irina-Camelia Begu) తలపడింది.
అయితే మ్యాచ్ లో ప్రత్యర్థికి పాయింట్ కోల్పోయిన బెగూ.. గేమ్ బ్రేక్ మధ్య కోర్టు మారుతూ తన చేతిలోని రాకెట్ ను నేలకేసి బలంగా కొట్టింది. అయితే అంతే వేగంగా పైకి ఎగిరిన రాకెట్.. కోర్టుకు దగ్గరగా ఉన్న ప్రేక్షకుల గ్యాలరీలోని ఓ పిల్లాడి మొహాన్ని బలంగా తాకింది. దాంతో అతడు కాసేపు విలవిల్లాడాడు. తాను చేసిన తప్పును గ్రహించిన ఆమె.. ప్రేక్షకుల దృష్టిలో విలన్ కాకూడదని భావించి పిల్లాడిని కాసేపు ఎత్తుకొని లాలించింది. అనంతరం పిల్లాడి తల్లీదండ్రులకు ఆమె క్షమాపణలు చెప్పింది. తాజాగా ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ ఆమెకు 10 వేల అమెరికన్ డాలర్ల ఫైన్ ను విధిస్తూ.. ఇటువంటి తప్పు మళ్లీ రిపేట్ అయితే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చిరించింది. ఇక మ్యాచ్ లో బెగూ 6-7 (3/7), 6-3, 6-4తో అలెగ్జాండ్రోవాపై విజయం సాధించింది.
Lucky not to have been 𝗱𝗲𝗳𝗮𝘂𝗹𝘁𝗲𝗱 😲
Watch the moment as Irina-Camelia Begu throws her racquet into the crowd which caused a child in the crowd to cry 🫣#RolandGarros | #RG22 pic.twitter.com/hc7jAhy1Ba
— Eurosport (@eurosport) May 26, 2022
ఈ సంఘటనపై స్పంధించిన ఫ్యాన్స్.. అందం ఉంటే సరిపోదు సహనం కూడా ఉండాలంటూ ట్వీట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా ఆమెను డిస్ క్వాలిఫై ఎందుకు చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. 2020 యూఎస్ ఓపెన్ సందర్భంగా లైన్ అంపైర్ ను బంతితో కొట్టినందుకు ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ను చైర్ అంపైర్ డిస్ క్వాలిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం చైర్ అంపైర్ కానీ, ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ మాత్రం అటువంటి నిర్ణయం తీసుకోకపోవడం హాస్యాస్పదం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Tennis