French Open 2022 : కాలి మడమ (ankle)కు తీవ్ర గాయం అయినా జర్మనీ (Germany) స్టార్ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (alexander zverev) క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. నడవలేని స్థితిలో కూడా మైదానంలోకి వచ్చి తన హుందాతనాన్ని చాటుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ 2022 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో భాగంగా శుక్రవారం రాఫెల్ నడాల్ (Rafael Nadal), జ్వెరెవ్ ల మధ్య పురుషుల విభాగంలో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే రెండో సెట్ 12వ గేమ్ లో నడాల్ కొట్టిన ఫోర్ హ్యాండ్ షాట్ ను ఆడే క్రమంలో జ్వెరెవ్ కుడి కాలి మడమకు తీవ్ర గాయమైంది. దాంతో కోర్టులో కుప్పకూలిన అతడు కాసేపు విలవిల్లాడాడు. హుటాహుటిన అక్కడకు వచ్చిన ఫిజియోలు అతడిని వీల్ చైర్ లో తీసుకెళ్లారు. మరోవైపు నాదల్ కోర్టులోనే నిరీక్షిస్తూ ఉన్నాడు. కాసేపటికి జ్వెరెవ్ స్టిక్స్ సాయంతో మైదానంలోకి వచ్చి మ్యాచ్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. గాయంతో బాధపడుతున్న జ్వెరెవ్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంతో నాదల్ మొదలు ప్రతి ఒక్కరు కూడా అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. త్వరగా కోలుకుని తిరిగి కోర్టులో కనిపించాలని అందరూ కోరుకుంటున్నారు.
ఫైనల్ బెర్త్ కోసం ఇరువురు కూడా హోరాహోరీగా తలపడ్డారు. ప్రతి పాయింట్ కోసం ఇరువురు ప్లేయర్స్ చెమటలు కక్కారు. తొలి సెట్ లో ఇరువురు కూడా ఒక్కోసారి తమ సర్వీస్ లను కోల్పోవడంతో టై బ్రేక్ కు దారి తీసింది. ఇక టై బ్రేక్ లో జ్వెరెవ్ ఒక దశలో 6-2తో ఆధిక్య్ంలో నిలిచాడు. అయితే వరుసగా ఐదు పాయింట్లు సాధించిన నాదల్.. ఆతర్వాత అదే దూకుడును కొనసాగించి తొలి సెట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్ లో అటు నాదల్, ఇటు జ్వెరెవ్ తమ సర్వీస్ లను నిలుపుకోవడంలో విఫలం అయ్యారు.
ఇక 12వ గేమ్ లో నాదల్ కొట్టిన ఫోర్ హ్యాండ్ షాట్ ను ఆడేక్రమంలో జ్వెరెవ్ కుడి కాలి మడమ ట్విస్ట్ అయ్యింది. కోర్టులో కుప్పకూలిన జ్వెరెవ్ విలవిల్లాడాడు. వెంటనే ఫిజియోలు అతడి దగ్గరకు చేరుకుని వీల్ చైర్ లో అతడిని తీసుకుని వెళ్లారు. అనంతరం జ్వెరెవ్ గాయం తీవ్రమైనది కావడంతో అతడు ఆట నుంచి తప్పుకున్నాడు.
Alexander Zverev's injury in slow motion. You can see how awful it is. The German screams of pain still haunt the stadium. Poor Sascha. He's checked by the medical team right now. Officially, the game isn't over. Extract from the French TV channel France 2. #RolandGarros #Nadal pic.twitter.com/TV6FKkcl7V
— eolan (@brun_oisif) June 3, 2022
He gave his all for this match, what a sad way to end the match. Speedy recovery Alexander Zverev
🇩🇪 #RolandGarros2022 #FrenchOpen2022 pic.twitter.com/uwHCJHfi6y
— Man Above the Earth™ 🌍 (@Iamedinpaul_) June 3, 2022
దాదాపు మూడు గంటల పాటు ఈ మ్యాచ్ సాగినా రెండు సెట్లు కూడా పూర్తయ్యలేదంటే ఇరువురు ఏ విధంగా ఆడారో మనకు ఇట్టే అర్థం అవుతుంది. మ్యాచ్ లో నాదల్ 3 ఏస్ లు సంధించి ఒక డబుల్ ఫాల్ట్ చేయగా.. జ్వెరెవ్ 5 ఏస్ లు 8 డబుల్ ఫాల్ట్ లు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ జ్వెరెవ్ గాయంతో మధ్యలోనే ఆట నుంచి వైదొలిగాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Tennis