హోమ్ /వార్తలు /క్రీడలు /

French Open 2022 : గాయంతో టెన్నిస్ కోర్టులో విలవిల్లాడిన టెన్నిస్ స్టార్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించిన నడాల్

French Open 2022 : గాయంతో టెన్నిస్ కోర్టులో విలవిల్లాడిన టెన్నిస్ స్టార్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించిన నడాల్

అలెగ్జాండర్ జ్వెరెవ్ (PC : TWITTER)

అలెగ్జాండర్ జ్వెరెవ్ (PC : TWITTER)

French Open 2022 : అనూహ్య పరిస్థితుల నడుమ స్పెయిన్ (Spain) బుల్, క్లే కింగ్ రాఫెల్ నడాల్ (Rafael Nadal) మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో ఫైనల్లోకి ప్రవేశించాడు.

French Open 2022 : అనూహ్య పరిస్థితుల నడుమ స్పెయిన్ (Spain) బుల్, క్లే కింగ్ రాఫెల్ నడాల్ (Rafael Nadal) మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ లో రాఫెల్ నడాల్ 7-6 (10/8), 6-6తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) (alexander zverev) గాయంతో మ్యాచ్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. ఫలితంగా నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో 14వ సారి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లు నాదలే ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం విశేషం.

ఫైనల్ బెర్త్ కోసం ఇరువురు కూడా హోరాహోరీగా తలపడ్డారు. ప్రతి పాయింట్ కోసం ఇరువురు ప్లేయర్స్ చెమటలు కక్కారు. తొలి సెట్ లో ఇరువురు కూడా ఒక్కోసారి తమ సర్వీస్ లను కోల్పోవడంతో టై బ్రేక్ కు దారి తీసింది. ఇక టై బ్రేక్ లో జ్వెరెవ్ ఒక దశలో 6-2తో ఆధిక్య్ంలో నిలిచాడు. అయితే వరుసగా ఐదు పాయింట్లు సాధించిన నాదల్.. ఆతర్వాత అదే దూకుడును కొనసాగించి తొలి సెట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్ లో అటు నాదల్, ఇటు జ్వెరెవ్ తమ సర్వీస్ లను నిలుపుకోవడంలో విఫలం అయ్యారు. ఇక 12వ గేమ్ లో నాదల్ కొట్టిన ఫోర్ హ్యాండ్ షాట్ ను ఆడేక్రమంలో జ్వెరెవ్ ఎడమ కాలి మడమ ట్విస్ట్ అయ్యింది. కోర్టులో కుప్పకూలిన జ్వెరెవ్ విలవిల్లాడాడు. వెంటనే ఫిజియోలు అతడి దగ్గరకు చేరుకుని వీల్ చైర్ లో అతడిని తీసుకుని వెళ్లారు. అనంతరం జ్వెరెవ్ గాయం తీవ్రమైనది కావడంతో అతడు ఆట నుంచి తప్పుకున్నాడు.

దాదాపు మూడు గంటల పాటు ఈ మ్యాచ్ సాగినా రెండు సెట్లు కూడా పూర్తయ్యలేదంటే ఇరువురు ఏ విధంగా ఆడారో మనకు ఇట్టే అర్థం అవుతుంది. మ్యాచ్ లో నాదల్ 3 ఏస్ లు సంధించి ఒక డబుల్ ఫాల్ట్ చేయగా.. జ్వెరెవ్ 5 ఏస్ లు 8 డబుల్ ఫాల్ట్ లు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ జ్వెరెవ్ గాయంతో మధ్యలోనే ఆట నుంచి వైదొలిగాడు.

First published:

Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Tennis

ఉత్తమ కథలు