హోమ్ /వార్తలు /క్రీడలు /

Coco Gauff : అగ్రరాజ్యం అని జబ్బలు చరుచుకోవడం కాదు.. ఈ టీనేజ ప్లేయర్ ను చూసైనా బుద్ది తెచ్చుకో

Coco Gauff : అగ్రరాజ్యం అని జబ్బలు చరుచుకోవడం కాదు.. ఈ టీనేజ ప్లేయర్ ను చూసైనా బుద్ది తెచ్చుకో

రన్నరప్ ట్రోఫీతో కోకో (PC : TWITTER)

రన్నరప్ ట్రోఫీతో కోకో (PC : TWITTER)

French Open 2022 : కోకో గాఫ్ (Coco Gauff) టెన్సిస్ (Tennis)లో ఇప్పుడో సంచలనం. 2019లో ఎటువంటి అంచనాలు లేకుండా క్వాలిఫయర్ హోదాలో వింబుల్డన్ (wimbledon) గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో అడుగు పెట్టిన ఈ అమెరికన్ టీనేజ్ ప్లేయర్ సంచలన విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుని సంచలనం సృష్టించింది.

ఇంకా చదవండి ...

French Open 2022 : కోకో గాఫ్ (Coco Gauff) టెన్సిస్ (Tennis)లో ఇప్పుడో సంచలనం. 2019లో ఎటువంటి అంచనాలు లేకుండా క్వాలిఫయర్ హోదాలో వింబుల్డన్ (wimbledon) గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో అడుగు పెట్టిన ఈ అమెరికన్ టీనేజ్ ప్లేయర్ సంచలన విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుని సంచలనం సృష్టించింది. తొలి రౌండ్ లో అమెరికాకే చెందిన దిగ్గజ ప్లేయర్ వీనస్ విలియమ్స్ తో పోటీ పడిన గాఫ్.. అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి అందరి చూపును తనవైపునకు తిప్పుకుంది. అదే దూకుడును కనబరిచిన ఆమె.. పలు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో తన మార్కును చూపించగలిగింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ 2022లో కూడా గాఫ్ సంచనలన ప్రదర్శన చేసింది. వరుస విజయాలతో ఫైనల్ వరకు చేరుకున్న గాఫ్.. తుది మెట్టుపై పొలాండ్ భామ ఇగా స్వియాటెక్ (Iga swiatek) చేతిలో ఓడి త్రుటిలో చరిత్రకు దూరమైంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత గాఫ్ చేసిన పని అమెరికాకు చెంప చెల్లుమనిపించేలా చేసింది.

ఇది కూడా చదవండి : ఒకరు గెలిస్తే చరిత్ర.. మరొకరు గెలిస్తే ఆనవాయితీ.. తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే?

తమదే అగ్రరాజ్యం అంటూ జబ్బలు చరుచుకునే అమెరికాలో గన్ కల్చర్ ఏ విధంగా రాజ్యమేలుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అంగట్లో సరుకులులాగా అక్కడ ప్రతి ఒక్కరికి గన్ కొనే సౌలభ్యం ఉంటుంది. ఇదే ఇప్పుడు ఆ దేశానికి యమపాశంలా తయారైంది. ఏటా కొన్ని వేలకు పైగా ప్రజలు ఈ గన్ కల్చర్ మూలానా ప్రాణాలను కోల్పోతున్నారు. 2012లో కనెక్టికట్ లోని ఒక స్కూల్ లో జరిగిన గన్ ఫైరింగ్ వల్ల దాదాపు 20 మందికి పైగా పిల్లలు మరణించారు. మళ్లీ మొన్న టెక్సాస్ లో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. 18 ఏళ్ల టీనేజర్ ఒక స్కూల్ లోకి వెళ్లి కాల్పులు జరపడంతో 19 మంది చిన్నారులతో పాటు ఇద్దరు టీచర్లు మరణించారు. దాంతో అమెరికాలో ఉన్న గన్ కల్చర్ పై అన్ని వర్గాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. తాజాగా కోకో గాఫ్ కూడా ఈ జాబితాలో చేరింది. ఫ్రెంచ్ ఓపెన్ లో మ్యాచ్ ముగించుకున్న గాఫ్.. కెమెరాపై ’శాంతి.. గన్ వైలెన్స్ కు ముగింపు పలకండి‘ అంటూ సందేశమిచ్చింది.

మహిళల విభాగంలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో గాఫ్ 1-6, 3-6తో పొలాండ్ భామ ఇగా స్వియాటెక్ చేతిలో ఓడి తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలవాలనే కలకు దూరమైంది. అద్భుత ఆటతీరు కనబర్చిన ప్రపంచ నంబర్ వన్ స్వియాటెక్ తన కెరీర్ ల ో రెండో ఫ్రెంచ్ ఓపెన్ ను సాధించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: America, French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Tennis, USA, Wimbledon

ఉత్తమ కథలు