French Open 2019: ఫెదరర్ ఔట్...ఫైనల్‌కు దూసుకెళ్లిన నడాల్

పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో నడాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 6-3,6-4, 6-2 తేడాతో ఫెదరర్‌పై గెలిచి ఫైనల్ చేరాడు.

news18-telugu
Updated: June 7, 2019, 10:37 PM IST
French Open 2019: ఫెదరర్ ఔట్...ఫైనల్‌కు దూసుకెళ్లిన నడాల్
నడాల్
  • Share this:
ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్‌ అదరగొడుతున్నాడు. సెమీ ఫైనల్‌లో స్విస్ దిగ్గజం ఫెదరర్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం ప్యారిస్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో నడాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 6-3,6-4, 6-2 తేడాతో ఫెదరర్‌పై గెలిచి ఫైనల్ చేరాడు. తొలిసెట్‌లో ఫెదరర్‌ను చాలా ఈజీగా నిలువరించాడు నడాల్. రెండో సెట్‌లో హోరాహోరీగా సాగినా...చివరికి నడాలే పైచేయి సాధించాడు. మూడో సెట్‌లో వార్ వన్‌సైడ్‌గా సాగింది. దాంతో వరుస పాయింట్లతో పాటు మ్యాచ్‌నూ గెలిచాడు.

2011 తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నడాల్, ఫెదరర్ తలపడడం ఇదే తొలిసారి. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాడల్‌పై ఇప్పటి వరకు ఫెదరర్ గెలవలేదు. మొత్తంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఈ చిరకాల ప్రత్యర్థులు ఆరుసార్లు తలపడగా ఆరుసార్లూ నడాలే విజయం సాధించాడు. కాగా, గత ఏడాది French Open-2018 టైటిల్‌‌ను కూడా నడాలే గెలిచిన సంగతి తెలిసిందే.

ఇక మరో సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. జోకోవిచ్, డొమినిక్ థీమ్ మ్యాచ్ జరుగుతుండగా వర్షం పడింది. మొదటి సెట్‌‌ని 6-2 తేడాతో కైవసం చేసుకున్నాడు థీమ్. ఇక రెండో సెట్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 3-6 తేడాతో జోకోవిచ్ రెండో సెట్‌ని గెలిచాడు. దాంతో మ్యాచ్ విజయాన్ని తేల్చే మూడో సెట్‌ ఆరంభమైన కాసేపటికే వర్షం మొదలయింది. అప్పటికి 3-1తో లీడ్‌లో ఉన్నాడు థీమ్. ఐతే భారీగా వాన పడడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరిగి మ్యాచ్‌ని కొనసాగిస్తారు. వీరిలో గెలిచిన ప్లేయర్ ఆదివారం ఫైనల్‌లో నాడల్‌ని ఢీకొట్టాల్సి ఉంటుంది.

First published: June 7, 2019, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading