French Open 2019: ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్..కెరీర్‌లో 12వ సారి..

కెరీర్‌లో 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలవగా... మొత్తంగా 18వ గ్రాండ్ స్లామ్ సాధించాడు.

news18-telugu
Updated: June 9, 2019, 10:46 PM IST
French Open 2019: ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్..కెరీర్‌లో 12వ సారి..
రఫెల్ నాదల్
news18-telugu
Updated: June 9, 2019, 10:46 PM IST
స్పానిష్ బుల్ రఫెల్ నాదల్ మళ్లీ సత్తా చాటాడు. 'కింగ్ ఆఫ్ క్లే' అని మరోసారి నిరూపించుకున్నాడు. ప్యారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్-2019 ఫైనల్‌లో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ఫైనల్‌లో ఆస్ట్రియాకు చెందిన డొమినిక్‌పై 6-3, 5-7, 6-1, 6-1 తేడాతో విజయం సాధించాడు నాదల్. కెరీర్‌లో 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలవగా... మొత్తంగా 18వ గ్రాండ్ స్లామ్ సాధించాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నాదల్‌కు థీమ్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. తొలి సెట్ హోరాహరీగా సాగిన చివరకు నాదలే గెలిచాడు. ఇక రెండో సెట్‌ని గెలిచి నాదల్‌కు షాకిచ్చాడు థీమ్. ఓ దశలో థీమ్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించినా ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టుకోల్పోయాడు. రెండో సెట్‌ను కోల్పోయిన నాదల్‌ ఆ తర్వాత థీమ్‌కు ఏ మాత్రం అవకాశమివ్వలేదు. మూడు, నాలుగు సెట్లను సునాయసంగా గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు.

ఫైనల్‌లో డొమినిక్ థీమ్ 7 ఏస్‌లు సంధించగా, నాదల్ 3 ఏస్‌లకే పరిమితమయ్యాడు. థీమ్ ఒక డబుల్‌ ఫాల్ట్‌ తప్పిదం చేయగా..నాదల్ అలాంటివేమీ చేయలేదు. అటు నాదల్‌ 7 బ్రేక్ పాయింట్లను సాధించగా, థీమ్ రెండు బ్రేక్‌ పాయింట్లను మాత్రమే సాధించాడు. సర్వీస్‌ పాయింట్ల విషయంలో నాదల్‌ హవానే కొనసాగింది. 75 సర్వీస్‌ పాయింట్లను నాదల్‌ గెలవగా, 51 సర్వీస్‌ పాయింట్లకే థీమ్ పరిమితయ్యాడు. మొత్తంగా నాదల్‌ 116 పాయింట్లను గెలవగా, థీమ్ 82 పాయింట్లను గెలిచాడు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...