Home /News /sports /

FOUR PLAYERS AND THE PRESIDENT OF BRAZILIAN FOOTBALL CLUB DIED IN A PLANE CRASH TOCANTINS SRD

Plane crash : బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం...నలుగురు ఫుట్​బాల్ ప్లేయర్లు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Plane crash : బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. టొక్టానిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో..

    బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. టొక్టానిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్​బాల్ ఆటగాళ్లు మరణించారు. జట్టు అధ్యక్షుడితో పాటు పైలట్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్​లో ఈ ఘటన జరిగిందని టీం యాజమాన్యం వెల్లడించింది. విమానంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది.టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలమీద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. విలానోవా జట్టుతో గేమ్ ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. మృతులను లుకాస్ మెయిరా , లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విమానం ఎలాంటిదన్న విషయంపై జట్టు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. వీరంతా పామాస్ ఫుట్ బాల్ క్లబ్ కి చెందిన వారు. ఈ పామాస్ ఫుట్ బాల్ క్లబ్ ను 1997 లో స్థాపించారు. ఇది బ్రెజిల్ లోని నార్త్ ఫోర్ డివిజన్ కు చెందిన క్లబ్. పుట్ బాల్ ఆటగాళ్లంతా విమాన ప్రమాదంలో చనిపోవడంతో పామాస్ ఫుట్ బాల్ క్లబ్ లో విషాదం నెలకొంది.  ఈ విమాన ప్రమాదంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమాన ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం ఎలా జరిగింది.. అసలు విమానం ఎలాంటిది అన్న దానిపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Brazil, Football, Plane Crash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు