హోమ్ /వార్తలు /క్రీడలు /

Formula one: ఆ రష్యన్ డ్రైవర్ పై వేటు వేసిన ఫార్ములా వన్... కారణం ఏంటంటే?

Formula one: ఆ రష్యన్ డ్రైవర్ పై వేటు వేసిన ఫార్ములా వన్... కారణం ఏంటంటే?

నికితా మాజపిన్

నికితా మాజపిన్

Formula one: ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో రేసింగ్ ఈవెంట్ ఫార్ములా వన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా డ్రైవర్లపై నిషేధం విధించింది. దాంతో ఈ ఏడాది ఫార్ములా వన్ రష్యన్ గ్రాండ్ ప్రి, రష్యన్ డ్రైవర్లు లేకుండానే జరగనుంది.

Formula one:  రష్యా-ఉక్రెయిన్ (russia-ukraine war) యుద్ధం రేసింగ్ ఈవెంట్ ఫార్ములా వన్ (Formunla one)పై పడింది. ఉక్రెెయిన్ పై రష్యా దాడిని నిరసిస్తూ... మొన్ననే ఫార్ములా వన్ సీజన్ 2022 క్యాలెండర్ (calendar) నుంచి రష్యా గ్రాండ్ ప్రిని రద్దు చేసిన నిర్వాహకులు... తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్ లో హ్యాస్ (Haas) టీంకు డ్రైవర్ గా ఉండాల్సిన రష్యా డ్రైవర్ నికీత మాజపిన్ (Nikita mazepin)పై వేటు వేస్తూ ఫార్ములా వన్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హ్యాస్ టీం అతడి కాంట్రాక్టును రద్దు కూడా చేసింది. అంతేకాకుండా హ్యాస్ టీంకు టైటిల్ స్పాన్సర్ గా ఉన్న ఉరాల్ కలి (uralkali)ని కూడా తొలగించింది. ఉరాల్ కలి రష్యాకు చెందిన కంపెనీ. అంతేకాకుండా ఈ కంపెనీ ఓనర్ నికితీ మాజపిన్  ఫాదర్  కావడం విశేషం.

నికితా మాజపిన్ గతేడాదే ఫార్ములాన్ 1లో చోటు దక్కించుకున్నాడు. వాస్తవానికి అతడు పెయిడ్ డ్రైవర్... అంటే డబ్బులిచ్చి ఫార్ములా వన్ లో చోటు దక్కించుకున్నాడన్నమాట. అమెరికాకు చెందిన హ్యాస్ టీం మాజపిన్ ను తమ టీం డ్రైవర్ గా ఎంపిక చేసుకోగా... దానికి ప్రతి ఫలంగా మాజపిన్ తండ్రి కంపెనీ ఉరాల్ కలీ ఆ జట్టు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. అయితే తాజాగా ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగడంతో... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా సమాఖ్యలు రష్యా ప్లేయర్స్, అథ్లెట్లపై నిషేధం విధిస్తున్నారు. అందులో భాగంగానే ఫార్ములా వన్ కూడా రష్యన్ డ్రైవర్ అయిన మాజపిన్ పై వేటు వేసింది. తన వేటుపై మాజపిన్ స్పందించాడు కూడా. చాలా నిరాశకు గురైయ్యానని ట్వీట్ పెట్టాడు.

ఇక 2022 ఫార్ములా వన్ సీజన్ ఈ నెల 20న జరిగే బహ్రెయిన్ గ్రాండ్ ప్రితో ఆరంభం కానుంది. ఈ ఏడాది మొత్తం 23 రేసులు నిర్వహించనున్నారు. నవంబర్ 20న జరిగే అబుదాబి గ్రాండ్ ప్రితో 2022 ఫార్ములా వన్ సీజన్ ముగుస్తుంది. అయితే రష్యన్ గ్రాండ్ ప్రి ని క్యాలెండర్ నుంచి తొలగించడంతో... ఆ గ్రాండ్ ప్రిని ఏ గ్రాండ్ ప్రితో భర్తీ చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు ఫార్ములావన్ లో పాల్గొంటారు. ఫార్ములా వన్ ప్రపంచ డ్రైవర్ చాంపియన్ షిప్ కోసం 20 మంది డ్రైవర్లు... కన్ స్ట్రక్టర్ (టీం విభాగంలో ఇచ్చే టైటిల్) చాంపియన్ షిప్ కోసం 10 జట్లు పోటీ పడనున్నాయి. గతేడాది జరిగిన ఫార్ములావన్ సీజన్ లో డ్రైవర్ చాంపియన్ షిప్ టైటిల్ ను రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్ స్టాపెన్ సొంతం చేసుకున్నాడు. అతడు ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనున్నాడు. అతడికి మెర్సిడెస్ డ్రైవర్లు లూయిస్ హామిల్టన్ (lewis hamilton), జార్జ్ రసెల్, ఫెరారీ డ్రైవర్లు చార్లెస్ లెక్ లెర్క్, కార్లోస్ సెయింజ్ లనుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఏడాది రెగ్యూలేషన్స్ పూర్తిగా చేంజ్ అయ్యాయి.

First published:

Tags: Mercedes-Benz, Russia-Ukraine War