హోమ్ /వార్తలు /క్రీడలు /

Formula E : సాహో హైదరాబాద్.. న్యూయార్క్, లండన్, బెర్లిన్ సరసన భాగ్య నగరం.. ఫార్మాలా ఈ రేసుకు ఆతిథ్యం.. ఎప్పుడంటే?

Formula E : సాహో హైదరాబాద్.. న్యూయార్క్, లండన్, బెర్లిన్ సరసన భాగ్య నగరం.. ఫార్మాలా ఈ రేసుకు ఆతిథ్యం.. ఎప్పుడంటే?

ఫార్ములా ఈ లోగోను ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి

ఫార్ములా ఈ లోగోను ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి

Formula E : హైదరాబాద్ (Hyderabad) నగరం అరుదైన ఘనతను అందుకోబోతుంది. న్యూయార్క్, లండన్, బెర్లిన్ లాంటి సిటీల సరసన నిలవబోతుంది. వచ్చే ఏడాది హైదరాబాద్ వేదికగా ఫార్మాలా ఈ (Formula E) రేసు జరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Formula E : హైదరాబాద్ (Hyderabad) నగరం అరుదైన ఘనతను అందుకోబోతుంది. న్యూయార్క్, లండన్, బెర్లిన్ లాంటి సిటీల సరసన నిలవబోతుంది. వచ్చే ఏడాది హైదరాబాద్ వేదికగా ఫార్మాలా ఈ (Formula E) రేసు జరగనుంది. ఇప్పటికే ఫార్ములా ఈ నిర్వాహకులు విడుదల చేసిన 9వ సీజన్ క్యాలెండర్ లో హైదరాబాద్ కు చోటు కల్పించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ఫార్మాలా ఈ రేసుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు రోజుల పాటు 22 కార్లు హైదరాబాద్ నక్లెస్ రోడ్డుపై దూసుకెళ్లనున్నాయి. దాంతో ఫార్ములా ఈకి ఆతిథ్యమివ్వనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ ఘనత వహించనుంది. ఇక ఈ రేసుకు ప్రాచుర్యం కల్పించేందుకు ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు హైదరాబాద్ లో ఈ-మొబిలిటీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన లోగోను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. మరో బౌలర్ కు గాయం.! అసలేం జరుగుతుంది?

రేసింగ్ ప్రియులకు ఫార్ములా 1 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఫార్ములా వన్ లో ఉపయోగించే ఇంధనం వలన పర్యావరణం కలుషితం అవుతుందని చాలా మంది పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీరో కార్బన్ ఉద్ఘారాలు విడుదల చేసేలా ఫార్మాలా వన్ చర్యలు తీసుకుంటుంది. అయితే ఫార్ములా ఈ రూపంలో ఇప్పటికే జీరో కార్బన్ ఉద్ఘారాలు వెల్లడించే రేసింగ్ కూడా జరుగుతుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ తో నడిచే వాహనాలు ఇవి. ఫార్ములా వన్ తో పోల్చుకుంటే ఆదరణ తక్కువే. అయితే ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతుంది. ఇక భారత్ నుంచి మహీంద్ర రేసింగ్ పేరుతో విఖ్యాత కార్ల తయారీ దారు మహీంద్ర కంపెనీ కూడా పాల్గొంటుంది.

 గరిష్ట వేగం 280 kmph

నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, ఫార్ములా E Gen 2 కార్లు ఫార్ములా 1 కార్ల మాదిరిగానే ఉంటాయి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో నడుస్తాయి. 250kW బ్యాటరీతో నడిచే ఈ కారు మూడు సెకన్లలోపు 0 నుంచి 62 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 280 kmph. పూర్తి వేగంతో కారు పరుగులు తీస్తే శబ్దం కేవలం 80 డెసిబుల్స్‌కు చేరుకుంటుంది. ఈ కార్లు హైబ్రిడ్ టైర్లను ఉపయోగిస్తాయి.  ఫార్ములా E ప్రిక్స్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఫార్ములా E అనేది ఎలక్ట్రిక్-పవర్డ్ సింగిల్-సీటర్ ఛాంపియన్‌షిప్. ఏడో సంవత్సరం (2020-21 సీజన్)లో FIA ద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్ హోదాను పొందింది.

First published:

Tags: Hyderabad, India, KTR, Mahindra, Telangana

ఉత్తమ కథలు