హోమ్ /వార్తలు /క్రీడలు /

Gabbi Tuft: ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE మాజీ సూపర్ స్టార్.. భార్య మద్దతుగా నిలిచిందని ఏమోషనల్ పోస్ట్

Gabbi Tuft: ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE మాజీ సూపర్ స్టార్.. భార్య మద్దతుగా నిలిచిందని ఏమోషనల్ పోస్ట్

Gabbi Tuft (Photo Credit: Twitter)

Gabbi Tuft (Photo Credit: Twitter)

WWE మాజీ సూపర్ స్టార్ గబ్బి టఫ్ట్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను ట్రాన్సెజెండర్‌గా మారిన విషయాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు.

  WWE మాజీ సూపర్ స్టార్ గబ్బి టఫ్ట్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను ట్రాన్సెజెండర్‌గా మారిన విషయాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గబ్బి టఫ్ట్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. గతంలో తన ఫొటోతోపాటు.. ఇప్పుడు ఎలా ఉన్నానని తెలిపే ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. తాను తీసుకున్న నిర్ణయానికి తన భార్య, ఫ్యామిలీ చాలా మద్దతుగా నిలిచారని అన్నారు. "ఈ రోజు నేను చెప్పిన విషయం ప్రపంచవ్యాప్తంగా వార్తగా మారింది. ఇది నేనే. ఇందుకు సంబంధించి నేను సిగ్గుపడటం లేదు.. బాధపడటం లేదు. ప్రపంచం ఏమి అనుకుంటుందో అని భయపడి ఇన్నేళ్లుగా నేను నీడలో దాచిన అసలు కోణం. ఇక నేను దీని గురించి అస్సలు భయపడను. ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను.. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో దానిని ప్రేమించగలను. గత ఎనిమిది నెలలు నా మొత్తం జీవితంలో కొన్ని చీకట్లు కమ్ముకున్నాయి. ట్రాన్స్‌ జెండర్‌గా మారిన తర్వాత ప్రపంచాన్ని ఎదుర్కొవాలనే చాలాసార్లు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.

  ఇప్పుడు నాకు ఉన్న భయం ఇప్పుడు పూర్తిగా తొలిగిపోయింది. ఈ రోజు ఇతరులు నా గురించి ఏం అనుకుంటున్నారో పట్టించుకోకుండా.. నన్ను నేను మీకు పరిచయం చేసిన రోజు. నా ప్రేమించే భార్య, కుటుంబం, క్లోజ్‌ ఫ్రెండ్ నేను ఎలా ఉన్నానో దానిని అంగీకరించారు. దానికి నేను ఎల్లప్పుడు కృతజ్ఞుడిని. నా ఈ మార్గంలో మీరిచ్చే మద్దతనేది మీకు ఎప్పటికి తెలియదు. అందరు దీనిని అంగీకరిస్తారని నేను ఆశించడం లేదు. నేను బయటి రూపం మాత్రమే మారింది.. కానీ నా మనసు అలాగనే ఉంది. ఇందుకు సంబంధించి మీలో చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయని తెలుసు. నేను వాటికి సమాధానం ఇస్తాను. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ టీవీల్లో ప్రసారం అవుతుంది. సోషల్ మీడియాలో కూడా మీరు చూడొచ్చు" అని పేర్కొన్నారు.

  2007లో రెజ్లింగ్‌ ప్రారంభించిన టఫ్ట్ 2014 లో రింగ్‌కు వీడ్కోలు పలికారు. అయితే రింగ్ నేమ్ Tyler Reksతో టఫ్ట్‌ బరిలో నిలిచేవాడు. అతడు WWE Superstars, WWE Raw, WWE SmackDown, WWE Wrestlemaniaలలో టఫ్ట్ కనిపించాడు. ఇక, రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పాక టఫ్ట్.. తన సమయాన్ని భార్య ప్రిస్సిల్లా, కుమార్తెతో ఎక్కువగా గడిపారు. ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్, మోటివేషనల్ స్పీకర్‌గా కెరీర్‌ని రీస్టార్ట్‌ చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Transgender

  ఉత్తమ కథలు