• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • FORMER US OLYMPIC GYMNASTICS COACH JOHN GEDDERT DIES BY SUICIDE AFTER ABUSE TRAFFICKING CHARGES SRD

Gymnastics coach : బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు..ఒలింపిక్ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ ఆత్మహత్య

Gymnastics coach : బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు..ఒలింపిక్ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ ఆత్మహత్య

Photo Credit : Twitter

Gymnastics coach : అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్మాస్టిక్స్ కోచ్ జాన్‌ గెడ్డార్ట్‌ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

  • Share this:
    అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్మాస్టిక్స్ కోచ్ జాన్‌ గెడ్డార్ట్‌ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. లైంగిక వేధింపుల ఆరోపణల వల్లే జాన్‌ గెడ్డార్ట్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే..గతంలో బలింపిక్ జిమ్నాస్టిక్స్ కోచ్ గా పనిచేశారు జాన్ గెడ్డార్ట్. ఆ తర్వాత మిచిగాన్ లో మహిళా జిమ్నాస్ట్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఇందులో లారీ నాసర్ అనే వ్యక్తి డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అనేక మంది మహిళలు జిమ్నాస్టిక్ శిక్షణ కోసం ఈ సెంటర్ కు తరలి వచ్చేవారు. అయితే, నాసర్ తో కలిసి జాన్ గెడ్డార్ట్.. అక్కడి మహిళా జిమ్నాస్ట్ లను లైంగికంగా వేధించేవారని ఇటీవల సంచలన ఆరోపణలు వచ్చాయ్. మహిళల్ని లైంగికంగా వేధించడంతో పాటు..మానసికంగా కూడా హింసించేవారని నాసల్ అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై కేసు కూడా నమోదు చేసుకున్నారు.

    లైంగిక వేధింపులకు గురైన వారిలో ఎక్కువగా 13, 16 సంవత్సరాల లోపు వయసువారే అని మిచిగాన్‌ అటార్నీజనరల్‌ డెనా నిసెల్‌ తెలిపారు. గెడ్డార్ట్‌, నాసర్‌లు తన కూతురిని కూడా లైంగికంగా వేధించారని ఒక జిమ్నాస్టిక్‌ ట్రైనీ తల్లి ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు..జాన్ ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

    ఈ విషయం తెలిసి.. తీవ్ర ఒత్తిడికి గురైన జాన్‌ గెడ్డార్ట్‌ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే, గెడ్డార్ట్‌ తనను లైంగికంగా వేధించాడని మాజీ జిమ్నాస్ట్‌ రాచెల్‌ డెస్‌హోలాండర్‌ 2000 సంవత్సరంలోనే సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించించింది. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణల్ని అప్పట్లో జాన్ గెడ్డార్డ్ తోసిపుచ్చారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు