Home /News /sports /

Cricket : భారత్ లోనూ వర్ణవివక్ష.. జీవితాంతం ఎదుర్కొన్నానంటూ బాంబు పేల్చిన మాజీ క్రికెటర్..

Cricket : భారత్ లోనూ వర్ణవివక్ష.. జీవితాంతం ఎదుర్కొన్నానంటూ బాంబు పేల్చిన మాజీ క్రికెటర్..

Cricket ( ప్రతీకాత్మక చిత్రం)

Cricket ( ప్రతీకాత్మక చిత్రం)

Cricket : ఐపీఎల్​ లాంటి లీగ్​ల్లో అయితే ఒకే డ్రెస్సింగ్​రూమ్​ను​ పంచుకుంటారు. అయితే ఇలాంటి ఆటలోనూ జాత్యాంహంకార ధోరణి, వర్ణవివక్ష వంటి ఘటనలు అనేకం చూశాం. ముఖ్యంగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్టుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకూనే ఉంటాయ్.

ఇంకా చదవండి ...
    క్రికెట్‌ (Cricket Latest Updates).. ఒక జెంటిల్‌మెన్‌ గేమ్ అని ప్రతి క్రికెటర్‌, అభిమాని గొప్పగా ఫీలవుతుంటారు. ఇందుకు తగ్గట్లే విభిన్న దేశాల క్రికెటర్లు.. రంగు, మతం, జాతి అనే తేడా లేకుండా ఈ క్రీడలో మమేకమై పోటీపడుతుంటారు. ఇక ఐపీఎల్​ లాంటి లీగ్​ల్లో అయితే ఒకే డ్రెస్సింగ్​రూమ్​ను​ పంచుకుంటారు. అయితే ఇలాంటి ఆటలోనూ జాత్యాంహంకార ధోరణి, వర్ణవివక్ష వంటి ఘటనలు అనేకం చూశాం. ముఖ్యంగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్టుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకూనే ఉంటాయ్. మన టీమిండియా (Team India)లో క్రికెట్ కు మాయ తెచ్చే ఘటనలు జరగడం అరుదైన చెప్పొచ్చు. కానీ, లేటెస్ట్ గా టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్.. దిగ్గజ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ (Laxman Sivaramakrishnan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన జీవితకాలమంతా వర్ణ వివక్షకు గురైనట్లు ట్వీట్‌ చేశారు.

    అయితే ఈ వివక్షతో తాను ఏనాడు బాధపడలేదని శివరామకృష్ణన్ స్పష్టం చేశాడు. సోషల్ మీడియా వేదికగా కామెంటేటర్లపై జరుగుతన్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ శివరామకృష్ణన్ ఈ ట్వీట్ చేశాడు. " నా రంగుతో నేను వివక్షకు గురయ్యాను. విమర్శలూ ఎదుర్కొన్నాను. నా జీవితమంతా ఇలానే గడిచింది కాబట్టే నన్నేమీ అది బాధించలేదు. దురదృష్టవశాత్తూ ఇది మన దేశంలోనే జరిగింది " అని ఆయన పోస్ట్‌ చేశారు.

    Laxman Sivaramakrishnan


    తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల శివరామకృష్ణన్‌ భారత్‌ తరఫున 1983 నుంచి 1987 మధ్య కాలంలో 9 టెస్టులు ఆడి 26 వికెట్లు, 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశారు. ఆ తర్వాత కామెంటేటర్‌గా సేవలందిస్తున్నాడు. భారత క్రికెట్‌లో పలు పదవులను కూడా ఆయన చేపట్టారు. టీమిండియా మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సైతం వర్ణ వివక్షకు గురైనట్లు ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ పోస్ట్‌లో ముకుంద్ తన ఆవేదనను పంచుకున్నాడు.




    "నా 15 ఏళ్ల వయసు నుంచే ఈ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు కూడా ప్రయాణించాను. నేను యువకుడిగా ఉన్నప్పుడు వర్ణ వివక్షకు గురయ్యాను. నా శరీర రంగును ప్రజలు విచిత్రంగా చూసేవారు. నేను ఎండలోనే ఆడేవాడిని కాబట్టి నల్లగా అయ్యేవాడిని. కానీ ఎన్నడూ దాని గురించి బాధపడలేదు. " అని పేర్కొన్నాడు.

    ఇది కూడా చదవండి :  10 ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కేఎస్ భరత్

    గత కొన్ని నెలలుగా క్రికెట్‌లో వివక్ష అనేది తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ క్రికెట్‌లో ఈ అంశం ఆటగాళ్లపై నిషేధం విధించే వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్‌ కామెంట్రీ చెప్పకుండా చేసింది. గత సంవత్సరం మాజీ పేసర్ దొడ్డ గణేష్ కూడా జాతి వివక్ష గురించి తన అనుభవాన్ని వెల్లడించాడు. మాజీ యార్క్‌షైర్ ఆటగాడు అజీమ్ రఫీక్ పార్లమెంటరీ విచారణలో తాను ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి సాక్ష్యమివ్వడంతో ఇంగ్లీష్ క్రికెట్ ఇటీవల తుఫానుకు కేంద్రంగా మారింది. దీంతో యార్క్‌షైర్ క్లబ్‎పై నిషేధం విధించారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai, Cricket, Sports, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు