Home /News /sports /

FORMER TEAM INDIA PLAYER AND MISTER IPL SURESH RAINA COMMENTS MAKES HUGE CONTROVERSY IN TAMIL NADU PREMIER LEAGUE SRD

Suresh Raina : తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న సురేష్ రైనా..అలా అనడంతో పెద్ద రచ్చ...

సురేష్ రైనా

సురేష్ రైనా

Suresh Raina : టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా (Suresh Raina) తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు.ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయ్. మరోవైపు, అయితే కొందరు ఉత్తరాది అభిమానులు మాత్రం సురేష్ రైనాకు మద్ధతుగా పోస్టులు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా (Suresh Raina) తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరుపున 11 సీజన్లుగా ఆడుతున్న సురేష్ రైనా, తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీ ఇస్తూ అక్కడి సంస్కృతిపై మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్‌కేతోనే ఉన్న రైనాను తన స‌హ‌చర కామెంటేట‌ర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు. దీంతో.. '' నేను కూడా బ్రాహ్మిణ్‌ను అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. అనిరుద్ధ శ్రీకాంత్, బ‌ద్రినాథ్‌, బాలాజీల‌తో క‌లిసి ఆడాను. ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం. సీఎస్‌కే జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్‌ ఉంటుంది.. అది ఎంతలా అంటే మాకు చాలా స్వేచ్చ దొరుకుతుంది. సీఎస్‌కే జట్టులో భాగం కావడం సంతోషంగా ఉంది '' అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ రైనా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే పెద్ద దుమారాన్ని రేపుతున్నాయ్.

    చెన్నై అంటే కేవలం బ్రాహ్మిణ్‌లే ఉంటారా అంటూ నెటిజన్లు సురేష్ రైనాపై ఫైరయ్యారు. '' సురేష్ రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుప‌డాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నావు.. నువ్వు నిజ‌మైన చెన్నై సంస్కృతిని చూసిన‌ట్లు లేవు'' అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయ్. మరోవైపు, అయితే కొందరు ఉత్తరాది అభిమానులు మాత్రం సురేష్ రైనాకు మద్ధతుగా పోస్టులు చేస్తున్నారు. చెన్నైలో ఫిల్టర్ కాఫీ, ఫుడ్, కల్చర్, తదితర విషయాలను చూసి చెన్నైలో బ్రహ్మాణులు ఆధిపత్యం ఉంటుందని రైనా భావించి ఉండవచ్చని అంటున్నారు. చాలామంది బ్రహ్మాణులు కూడా రైనాకి మద్ధతుగా " ఐ యామ్ బ్రాహ్మాణ్ ఆల్‌సో " హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తూ, బ్రహ్మాణుడిని అని చెప్పుకోవడంలో తప్పేముందని అంటున్నారు. రైనా చేసిన ఓ చిన్న కామెంట్ సోషల్ మీడియాలో పెను దుమారానికి దారి తీసింది.












    ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం సీఎస్‌కే తరపున ఆడాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు చేశాడు. ఇక సురేశ్‌ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వచ్చే ఐపీఎల్ లో సత్తా చాటి చెన్నై సూపర్ కింగ్స్ కు టైటిల్ అందించాలని సురేష్ రైనా ఉవ్విల్లూరుతున్నాడు. ఒకవేళ ధోనీ..ఐపీఎల్ నుంచి తప్పుకుంటే..తాను కూడా ఈ ధనాధన్ లీగ్ కు గుడ్ బై చెబుతానని ఇటీవల సురేష్ రైనా ప్రకటించాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IPL 2021, Sports, Suresh raina

    తదుపరి వార్తలు