Home /News /sports /

FORMER TEAM INDIA CRICKETER GAUTAM GAMBHIR TROLLED BY MS DHONI FANS FOR THIS REASON SRD

MS Dhoni vs Gambhir : గంభీర్‌కు ధోనీ అంటే అసూయ.. మహీ క్రేజ్ చూసి ఓర్చుకోలేకపోతున్నాడు..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

MS Dhoni vs Gambhir : ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌పై భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ ధోనీ అంటే గంభీర్‌కు అసూయ అని, అతనికున్న క్రేజ్‌ను చూసి గంభీర్‌ (Gambhir) ఓర్చుకోలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ధోనీ ఫ్యాన్స్ ఇలా చేయడానికి గౌతీ చేసిన పనే ఓ కారణం.

ఇంకా చదవండి ...
    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. జులై 7న 40వ పుట్టిన రోజు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజున మహీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేశారు. అదే విధంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ధోనీకి బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే, టీమిండియా మాజీ ఓపెనర్‌, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌పై భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ ధోనీ అంటే గంభీర్‌కు అసూయ అని, అతనికున్న క్రేజ్‌ను చూసి గంభీర్‌ (Gambhir) ఓర్చుకోలేకపోతున్నాడని మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. గౌతం గంభీర్ ధోనీ బర్త్ డే రోజున తన ఫేస్‌బుక్ కవర్ ఫొటోని తొలగించాడు. అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. జార్ఖండ్ డైనమేట్ అభిమానుల ఆగ్రహానికి ఆజ్యం పోసిందే ఈ కవర్ ఫొటో. 2011 ప్రపంచకప్ ఫైనల్లో గంభీర్ 97 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఫొటోను కవర్ పేజ్‌లో చేర్చాడు. అయితే, ఇన్నాళ్లు ఉంచిన ఈ ఫొటోను ధోనీ పుట్టిన రోజు నాడే మార్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ ఫ్యాన్స్ గంభీర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, గంభీర్ ఇది కావాలని చేశాడా? లేక మాములుగానే మార్చాడో తెలియదు కానీ, క్రికెట్ ప్రేమికులు మాత్రం తెగ ట్రోల్ చేసేశారు.

    ధోనీ విజయాలను తట్టుకోలేకే గంభీర్ ఇలా చేశాడని, గంభీర్ కి పొగరు ఎక్కువంటూ కామెంట్లు చేశారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ.. రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు గంభీర్ స్వాగతం పలకాలని, అప్పుడు ఉంటుంది అసలు మజా.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్, సెహ్వాగ్ ప్రారంభంలోనే కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది. విరాట్ కోహ్లీ (35)తో కలిసి గంభీర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.






    కోహ్లీ ఔటయ్యాక.. ధోనీతో కలిసి గంభీర్ దూకుడు పెంచాడు. అయితే, సెంచరీ వైపు వెళ్తున్న క్రమంలో గంభీర్ క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. ఇలా ఔటవ్వడానికి ధోనీనే కారణమని చాలా ఇంటర్వ్యూల్లో గౌతమ్ గంభీర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తన స్కోర్ చెప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయని, అందుకే ఔట్ అయ్యాయని తెలిపాడు. అలాగే 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఈ రెండు మ్యాచు‌ల్లో గౌతమ్ గంభీర్‌కు రావాల్సిన పేరు రాలేదు. ఈమేరకు చాలా అసహనంతో క్రికెట్‌కు గంభీర్ గుడ్‌బాయ్ చెప్పేశాడు. అలాగే, సమయం వచ్చినప్పుడల్లా ధోనీపై కామెంట్లు చేస్తూనే ఉంటాడు గౌతీ. దీంతో అతనిపై మహీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Cricket world cup 2011, Gautam Gambhir, Mahendra singh dhoni, Ms dhoni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు