హోమ్ /వార్తలు /క్రీడలు /

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆకాశ్ చోప్రా..

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆకాశ్ చోప్రా..

మహేంద్ర సింగ్ ధోనీ (ఫైల్ ఫోటో)

మహేంద్ర సింగ్ ధోనీ (ఫైల్ ఫోటో)

MS Dhoni : లేటెస్ట్ గా సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించడం ద్వారా 18 పాయింట్లతో చెన్నైప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

    ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) సెకండాఫ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేస్ కోసం SRH మినహా మిగతా జట్లు ప్రయత్నిస్తుండటంతో .. ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా వస్తోంది. ప్ర‌స్తుతానికి ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ నిల‌వ‌గా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ రేసు నుంచి ఎప్పుడో త‌ప్పుకుంది. దీంతో మిగిలిన ఆరు టీమ్స్ మ‌ధ్య మూడు బెర్తుల కోసం హోరాహోరీ పోటీ నెల‌కొంది. ఇక, గ‌తేడాది లీగ్ దశలోనే నిష్కమ్రించిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ (Chennai Super Kings).. ఈసారి దుమ్మురేపుతోంది. నిలిచింది. ధోనీ సేన 11 మ్యాచ్‌ల‌లో 9 గెలిచి, రెండింట్లో ఓడింది. 18 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ టీమ్ ఇంకా శ‌నివారం రాజ‌స్థాన్‌తో, సోమ‌వారం ఢిల్లీతో, గురువారం పంజాబ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (Mahendra Singh Dhoni)పై భారత మాజీ ఓపెనర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

    ప్రస్తుతం చెన్నై 10 మంది ప్లేయర్స్, ఓ కెప్టెన్​తో ఆడుతోందన్నాడు. ధోనీ బ్యాటింగ్​లో లోయర్ ఆర్డర్​లో రావడం, అతడి బ్యాటింగ్​తో జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్లే ఆకాశ్ చోప్రా ఈ కామెంట్స్ చేశాడు. ధోనీ ఓ బ్యాటర్‌గా ఉన్నా.. లేనట్టే అని ప్రస్తుత సీజన్​లో ఇప్పటివరకు 11 మ్యాచ్​లు ఆడిన మహీ 11.40 పేలవ సగటుతో కేవలం 66 పరుగులు మాత్రమే సాధించాడు.

    తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... "ఎంఎస్ ధోనీ ఓ కెప్టెన్, వికెట్​ కీపర్​గా మాత్రమే చెన్నై జట్టుకు సేవలందిస్తున్నాడు. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్​లో ధోనీ దిగువన ఆడుతున్నాడు. కొన్ని సార్లు ముందుగా బ్యాటింగ్ వచ్చినా.. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. దీనిని బట్టి గమనిస్తే ప్రస్తుతం చెన్నై 10 మంది ప్లేయర్స్, ఓ కెప్టెన్​తో ఆడుతోంది' అని సెటైర్ వేశాడు. అయితే అలాగే కెప్టెన్​గా ధోనీ జట్టును నడిపిస్తున్న తీరుపై ఆకాష్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'గతేడాది విఫలమైన చెన్నై ఈసారి పుంజుకుంది. వరుస విజయాలు సాధిస్తోంది. దీనికంతటికీ కారణం ధోనీ కెప్టెన్సీనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మహీ కనుక జట్టులో లేకపోతే ఇలాంటి ఫలితాలు వచ్చేవి కావు " అని తెలిపాడు.

    ఆకాశ్ చోప్రా (ఫైల్ ఫోటో)

    మరోవైపు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఒకప్పటి సీఎస్‌కే ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ ధోనీ అత్యంత విలువైన ఆటగాడన్నాడు. వయసు పై బడుతుంటడంతో ధోనీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నా.. జట్టులో కెప్టెన్‌గా ఎంతో కీలకంగా ఉన్నాడని పేర్కొన్నాడు.

    మైదానంలో మహీ వ్యూహాలు ఇప్పటికీ ఎంతో పదునుగా ఉంటాయని, అలాగే ఆటగాళ్ల నుంచి ఉత్తమ ఆటను ఎలా తీసుకరావాలో అతడికి బాగా తెలుసని హేడెన్‌ చెప్పాడు. లేటెస్ట్ గా సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించడం ద్వారా 18 పాయింట్లతో చెన్నైప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, Cricket, IPL 2021, Ms dhoni

    ఉత్తమ కథలు