మాజీ క్రికెటర్ ఇంట్లో విషాదం.. సోదరుడి దారుణహత్య

దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అతని సోదరుడు టైరాన్ దారుణ హత్యకు గురయ్యారు. కేప్‌టౌన్‌లో దుండగులు అతనిని కాల్చి చంపారు.

news18-telugu
Updated: October 8, 2020, 9:11 PM IST
మాజీ క్రికెటర్ ఇంట్లో విషాదం..  సోదరుడి దారుణహత్య
దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అతని సోదరుడు టైరాన్ దారుణ హత్యకు గురయ్యారు. కేప్‌టౌన్‌లో దుండగులు అతనిని కాల్చి చంపారు.
  • Share this:
దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అతని సోదరుడు టైరాన్ దారుణ హత్యకు గురయ్యారు.  కేప్‌టౌన్‌లో దుండగులు అతనిని కాల్చి చంపారు. ప్రస్తుతం టైరాన్ వయసు 32 ఏళ్ళు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి రక్త మడుగులో  పడి ఉన్న అతన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీని శవపరీక్ష కోసం స్ధానిక
ఆస్పత్రికి తరలించారు.

ఫిలాండర్ సోదరుడి మరణంపై స్పందించారు. "మా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సోదురున్ని కోల్పోయాను. టైరాన్ సోదరుడే కాదు... నాకు మంచి స్నేహితుడు కూడా" అంటూ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ హత్య ఉదంతంపై స్పందించిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామన్నారు. టైరాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసమని తెలిపారు.
Published by: Rekulapally Saichand
First published: October 8, 2020, 8:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading