హోమ్ /వార్తలు /క్రీడలు /

Herschelle Gibbs: " బీసీసీఐ నన్ను బెదిరిస్తోంది " .. మాజీ దిగ్గజ క్రికెటర్ సంచలన ఆరోపణలు ..

Herschelle Gibbs: " బీసీసీఐ నన్ను బెదిరిస్తోంది " .. మాజీ దిగ్గజ క్రికెటర్ సంచలన ఆరోపణలు ..

Herschelle Gibbs (File Photo)

Herschelle Gibbs (File Photo)

Herschelle Gibbs: దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ క్రికెటర్‌ హర్షలే గిబ్స్‌ (Herschelle Gibbs) బీసీసీఐ (BCCI)పై సంచలన ఆరోపణలు చేశాడు. తనపై బెదిరింపులకు పాల్పడిదంటూ ట్విటర్‌ వేదికగా ఆరోపించాడు.

దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ క్రికెటర్‌ హర్షలే గిబ్స్‌ (Herschelle Gibbs) బీసీసీఐ (BCCI)పై సంచలన ఆరోపణలు చేశాడు. తనపై బెదిరింపులకు పాల్పడిదంటూ ట్విటర్‌ వేదికగా ఆరోపించాడు. పాకిస్తాన్‌లో జరగబోయే కశ్మీర్‌ ప్రీమియర్‌ లీగ్‌(KPL 2021‌)లో పాల్గొనడానికి వీలేదని.. ఒకవేళ ఆడితే మాత్రం భవిష్యత్తులో భారత్‌లో జరిగే క్రికెట్‌ టోర్నీలు సహా క్రీడా కార్యక్రమాలకు అనుమతించమని హెచ్చరికలు జారీ చేసిందంటూ తెలిపాడు. అయితే గిబ్స్‌ ఆరోపణలపై బీసీసీఐ స్పందించలేదు. విషయంలోకి వెళితే... వచ్చే నెల ఆగస్టు 6 నుంచి కేపీఎల్‌ 2021 సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గిబ్స్‌ సహా లంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్‌ సహా మరికొందరు క్రికెటర్లు కూడా ఆడనున్నారు. అయితే గిబ్స్‌ ట్విటర్‌ వేదికగా బీసీసీఐపై ఆరోపణలు చేశాడు." KPL ‌ను భారత క్రికెట్ బోర్డు రాజకీయ అంశంతో రాద్దాంతం చేస్తోంది. కేపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ బెదిరిస్తోంది. మామాట కాదని కేపీఎల్ లీగ్‌లో ఆడితే.. భవిష్యత్తులో భారత్‌లో జరిగే కార్యక్రమాలకు పిలిచేది లేదంటూ హెచ్చస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ అభ్యంతరం తెలపడం నాకు నచ్చలేదు " అంటే ట్విట్టర్లో రాసుకొచ్చాడు గిబ్స్. మొత్తానికి గిబ్స్ చేసిన ఆరోపణలు.. మరోసారి దాయాదుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయ్. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ ఎలాంటి సమాధానమిస్తుందో వేచి చూడాలి.

గతంలో ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ కూడా కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశాడు. " కేపీఎల్ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లపై బీసీసీఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేపీఎల్‌లో ఆడిన ప్లేయర్లను భారత్‌లోకి అనుమతించమనడం సమంజసం కాదు " అంటూ ట్వీట్ చేశాడు.

కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో ఓవర్సీస్‌ వారియర్స్‌, ముజఫర్‌బాద్‌ టైగర్స్‌, రావల్‌కోట్‌ హాక్స్‌, బాగ్‌ స్టాలియన్స్‌, మీర్పూర్‌ రాయల్స్‌, కోట్లీ లయన్స్‌ టీమ్‌లుగా ఆడనున్నాయి. ఆయా జట్లకు ఇమాద్‌ వసీమ్‌, మహ్మద్‌ హఫీజ్‌, షాహిద్‌ అఫ్రిది, షాబాద్‌ ఖాన్‌, షోయబ్‌ మాలిక్‌, కమ్రాన్‌ అక్మల్‌లు సారథులుగా వ్యవహరించనున్నారు.

First published:

Tags: Bcci, Cricket, India VS Pakistan, South Africa, Sports

ఉత్తమ కథలు