హోమ్ /వార్తలు /క్రీడలు /

Asad Rauf Death : పాకిస్తాన్ వివాదాస్పద అంపైర్ గుండెపోటుతో మృతి

Asad Rauf Death : పాకిస్తాన్ వివాదాస్పద అంపైర్ గుండెపోటుతో మృతి

PC : TWITTER

PC : TWITTER

Asad Rauf Death : పాకిస్తాన్ (Pakistan) వివాదాస్పద అంపైర్ అసద్ రవూఫ్ (Asad Rauf) గుండెపోటుతో లాహోర్ (Lahore)లో మరణించాడు. అసద్ వయసు 66 సంవత్సరాలు. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asad Rauf Death : పాకిస్తాన్ (Pakistan) వివాదాస్పద అంపైర్ అసద్ రవూఫ్ (Asad Rauf) గుండెపోటుతో లాహోర్ (Lahore)లో మరణించాడు. అసద్ వయసు 66 సంవత్సరాలు. లాహోర్‌లోని లాండా బజార్‌లో తన బట్టల షాప్ మూసి వేసి ఇంటికి వెళ్లే క్రమంలో ఛాతిలో నొప్పితో అసద్ రవూఫ్ తీవ్రంగా ఇబ్బంది పడగా.. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్లు సోదరుడు తాహిర్ పేర్కొన్నాడు. అయితే అసద్ ను పరిశీలించిన వైద్యులు మరణించినట్లు తాహిర్ పేర్కొన్నాడు. అంపైర్ గా ఒక వెలుగు వెలిగిన అసద్ రవూఫ్.. 2013లో జరిగిన ఐపీఎల్ (IPL) కారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయాడు. బుకీల నుంచి కాస్ట్ లీ బహుమతులు స్వీకరించి అవినీతికి పాల్పడినట్లు బీసీసీఐ విచారణలో తేలింది. దాంతో అసద్ అంపైరింగ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఇది కూడా చదవండి : : ‘హనీమూన్ ముగిసింది.. ఇకపై అతడికి అంత ఈజీ కాదు’..

రవూఫ్ తన అంపైరింగ్ కెరీర్ ను 1998లో ఆరంభించాడు. 2000లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన వన్డేల్లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు. నాలుగు సంవత్సరాల తరువాత 2004లో రవూఫ్ తొలిసారిగా అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో చేర్చబడ్డాడు. తన కెరీర్ లో అసద్ 47టెస్టులు, 98వన్డేలు, 23 టీ20లకు అంపైర్‌గా పనిచేశాడు. అయితే ఐపీఎల్ 2013లో భాగంగా అతడు బుకీల నుంచి బహుమతులను అందుకుని తప్పుడు నిర్ణయాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం అతడిపై బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపింది. అందులో అసద్ తప్పు చేసినట్లు తేలింది. దాంతో అతడిని ఎలైట్ ప్యానెల్ అంపైర్ల నుంచి అసద్ ను తొలగించారు.

రవూఫ్ సమర్థవంతమైన అంపైర్‌ మాత్రమే కాదు పాకిస్థాన్‌లో ప్రఖ్యాత ఫస్ట్-క్లాస్ క్రికెటర్ కూడా. అతను 71 ఫస్ట్ క్లాస్, 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. అందులో రవూఫ్ మూడు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సహాయంతో వరుసగా 3423, 611 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో రవూఫ్ లాహోర్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ రైల్వేస్, పాకిస్తాన్ యూనివర్సిటీ జట్లకు ఆడాడు. అంపైరింగ్ కెరీర్ ముగిసిన  తర్వాత అతను అంపైరింగ్ మానేయాల్సి వచ్చింది. ఇక తర్వాత లాహోర్‌లోని లాండా బజార్లో తన బట్టల దుకాణాన్ని నడుపుతూ జీవితాన్ని వెల్లదీస్తున్నాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Babar Azam, ICC, Pakistan, T20 World Cup 2022, Team India

ఉత్తమ కథలు